Home Movie Reviews శోభనం గది సంగతులు - ‘మనియారయిలే అశోకన్’ రివ్యూ

శోభనం గది సంగతులు – ‘మనియారయిలే అశోకన్’ రివ్యూ

రచన – దర్శకత్వం : షంజు జేబా
తారాగణం : జాకబ్ గ్రెగరీ
, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు
సంగీతం : శ్రీహరి నాయర్, ఛాయాగ్రహణం : సజద్ కకూ
బ్యానర్ : వేఫేరర్ ఫిలిమ్స్
నిర్మాత :  దుల్కర్ సల్మాన్
విడుదల :  నెట్ ఫ్లిక్స్
2/5 

        మలయాళ సినిమా సబ్జెక్టుల విషయంలో ఎంత ముందుంటుందో, అంత వెనుకబడి కూడా వుంటుంది. ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’ తో ఎంత ముందుంటుందో, ‘సూఫీయు మ్ సుజాతాయుమ్’ తో అంత వెనుకబడి వుంటుంది. ‘సీయూ సూన్’ తో ఎంత దూకుడు గా వుంటుందో, ‘కప్పేలా’ తో అంత కూలబడి వుంటుంది. తాజాగా ఇప్పుడు ‘మనియారయిలే అశోకన్’ (అశోకను శోభనపు గది) వెనకడుగులు లెక్కేసుకుంటూ లెక్కేసుకుంటూ వెళ్ళి సరాసరి సూర్యాస్తమయం దిశగా అంతర్ధానమై పోయింది. లెక్కేసుకుని మరీ రెండు తూర్పున ఉదయించే సినిమాలుగా, మరో రెండు పడమట కుంగే సినిమాలుగా సమ భావంతో తీర్చిదిద్దుతున్నారు మలయాళ టాలెంట్ కొత్త దర్శకులు.

maniyarayile ashokan review
maniyarayile ashokan review

 

     కొత్త దర్శకుడు షంజు జేబా అవిరళ కృషి ‘మనియారయిలే అశోకన్’. దీనికి నిర్మాత దుల్కర్ సల్మాన్. హీరో జాకబ్ గ్రెగరీ. ఈ ఎన్నారై సహాయ నటుడు ఈ సినిమాతో హీరో అయ్యాడు. తెలుగులో కూడా బాగా తెలిసిన అనుపమా పరమేశ్వరన్ ఇందులో ఒక హీరోయిన్. ఈమె మొదట్లో వచ్చి వెళ్లిపోయాక, ఇంకో హీరోయిన్ గా నజ్రియా నజీమ్ చిట్ట చివర్లో వచ్చి సెటిలవుతుంది. వీళ్ళిద్దరి రాకపోకల మధ్యంతా ఏం జరిగిందన్నది అసలు విషయం. ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలై, 0.25 రేటింగ్ తో ట్రెండింగ్ అవుతోందంటే ఇంత ప్రమాద మెలా జరిగిందో చూద్దాం…

కథ
         
అశోకన్ (గ్రెగరీ) పొట్టి వాడు. అందుచేత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. వూళ్ళో అందరికీ పెళ్ళిళ్ళవుతూంటే, మొప్ఫై దాటుతున్నా పొట్టి తనం వల్ల తన పెళ్ళి ఒక కలగా మారింది. ఈ కలల్లో ఎందరెందరో పెళ్ళి కూతుళ్ళు, ఎన్నెన్నో శోభనపు గదులు. తేరుకుంటే ఎడారి జీవితం. పొట్టి తనమే కాదు, రంగు తక్కువనీ, చిరుద్యోగమనీ కూడా సంబంధాలు రావడం లేదు. ఇతడి కిద్దరు స్నేహితులు రతీష్ (కృష్ణ శంకర్), షైజూ (షైన్ టామ్ చాకో) – వీడికి పెళ్ళెలా చేయాలా అని ఆలోచిస్తూంటారు.

        తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. ఒక ప్రయత్నం ఫలించి పెళ్ళి చూపు లేర్పాటవుతాయి. తన కంటే పొడుగ్గా వున్న ఆ అమ్మాయి శ్యామ (అనుపమా పరమేశ్వరన్) ని చూసి నచ్చిందంటాడు. ఆమెకి నచ్చకపోయినా కోపిష్టి తండ్రి ముందు ఆమెకి సాగదు. పంతులు జాతకాలు చూస్తాడు. అశోకన్ జాతకం దారుణంగా వుంటుంది. పెళ్లి చేసుకుంటే తనో, తనని కట్టుకున్నదో చావడం ఖాయం. ఇంత దారుణమైన జాతకంతో సంబంధం తప్పినందుకు శ్యామ సంతోషిస్తుంది. అశోకన్ కి అశోక వనమే. 

        తర్వాత పంతుల్ని కలిసి మార్గం చెప్పమంటాడు. ముందు అరటి చెట్టుని పెళ్లి చేసుకో, తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోమంటాడు పంతులు. మొదటి పెళ్ళికే గండం గానీ రెండో పెళ్ళికి కాదంటాడు. అశోక్ వెళ్ళి తమ పొలంలోనే వున్న అరటి చెట్టుకి రహస్యంగా తాళి కట్టేస్తాడు. ఈ విషయం తెలీక ఏదో కారణం చేత వాళ్ళమ్మ అరటి చెట్టుని ఫటేల్ మని నరికేస్తుంది. ఇది చూసి తీవ్ర మానసిక క్షోభకి గురవుతాడు అశోకన్.

        ఇప్పుడేం చేశాడు? పెళ్ళికి మళ్ళీ కొత్త బాట ఎలా వేసుకున్నాడు? పొడగరి శ్యామనే చేసుకున్నాడా? పొట్టి తనంతో ఇబ్బంది తొలగిపోయిందా?…ఇవీ మిగతా కథలో తేలాల్సిన విషయాలు.  

నటనలు – సాంకేతికాలు  
         
అశోకన్ పాత్రని గ్రెగరీ ఫాంటసికల్ గా, మృదుమధురంగా నటించాడు. పెళ్లి, శోభనం, కాపురం వంటి కలల్లో తేలిపోతూ కళ్ళల్లో కైపు, మొహంలో మైమరపు, చేతల్లో అమాయ కత్వం అద్భుతంగా అభినయించాడు. తన సున్నిత అభినయానికి నేపథ్యంలో భావుకత తో కూడిన పాటలు, లాలిత్యంతో కూడిన సంగీతం జత కలిసి ఒక అలౌకిక ప్రపంచాన్ని సృష్టించాయి. దాదాపు గ్రెగరీ ఏకపాత్రాభినయం చేసినంత పని చేశాడు. పెళ్లి కాకపోతే ముప్ఫయ్యేళ్ళ వాడు తనలోకి తాను బాలుడిగా ఒదిగి పోతాడన్నట్టుగా మానసిక స్థితిని పోషించాడు. ‘నా కోసం దూర తీరాల్నుంచీ వచ్చావు, నా హృదయాన్ని ప్రేమతో నింపావు’  వంటి గీతాలాపనలతో మైకాన్నిసృష్టిస్తాడు. ఇలా నటనా పరంగా తను పూర్తి న్యాయమే చేశాడు, పాత్రే అన్యాయంగా వుంది. పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

        ఇక ఇద్దరు హీరోయిన్లు ఆయారామ్ గయారామ్ టైపు. అనుపమా పరమేశ్వరన్ మొదట్లో కాసేపు, నజ్రియా నజీమ్ చివర్లో కాసేపు కాల్షీటు చేసుకుని వెళ్లి పోతారు. మధ్యలో ఇంకో కాల్షీటు తీసుకుని నేవీ డ్రెస్సులో దుల్కర్ సల్మాన్ వచ్చి, గ్రెగరీని నాల్గు దులిపి వెళ్ళిపోతాడు. హీరోయిన్లు అతిధి పాత్ర లేసిన సినిమా ఇదే కావచ్చు దేశంలో.

        గ్రెగరీ స్నేహితులుగా కృష్ణ శంకర్, షైన్ టామ్ చాకో కూడా మృదువుగా నటిస్తారు. అందరిదీ మృదువైన నటనలే. సినిమా ఎక్కడా లౌడ్ గా వుండదు. సంభాషణలు లయబద్ధంగా వుంటాయి. దృశ్యాల్లో మోటు తనముండదు. తక్కువ పరికరాలతో సంగీతం కూడా మృదువుగా వుంటుంది. గ్రామం, చుట్టూ కొండలూ, ఘాట్ రోడ్ల లొకేషన్స్ పెయింటింగ్స్ లా వుంటాయి. మేకింగ్ పరంగా కొత్త అనుభూతి నిచ్చే ఆడియో- విజువల్ క్రియేషన్ ఇది. కొత్త దర్శకుడు షంజు జేబా తానూహించిన కథాప్రపంచం కంటే ఎక్కువే ఆవిష్కరించి వుంటాడు. తెలుగులో మేకింగ్ పరంగా చిన్న సినిమాలకి ఇలాటి ఆవిష్కరణలు ఎందుకు జరగవో ఎప్పుడూ వెంటాడే ప్రశ్నే.

కథా కథనాలు
         
ఇది రోమాంటిక్ డ్రామా జానర్ లో వున్న కథ. హీరో కాకుండా ఇతర పాత్రలు బలవంతం చేసి పెళ్లి జరిపించారు కాబట్టి ఇది రోమాంటిక్ డ్రామానే. సినిమా కథంటేనే హీరో కుండే గోల్. ఇక్కడ హీరోకి పొట్టి తనమనే సమస్య వుంది గానీ దాంతో ఏం చేయాలనే గోల్ లేదు. పొట్టి తనం శాపం కాదు, సమస్య కాదు. తన సైజు అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది. పొట్టితనం ఎప్పుడు సమస్య కావచ్చంటే, ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ అనే సూపర్ హిట్ లో పొట్టి లెక్చరర్ రాజ్ పల్ యాదవ్, పొడుగు రీతూపర్ణా సేన్ ని పెళ్లి చేసుకుని, అందరూ నవ్వుతున్నారని గింజికు చావడంలో వుండొచ్చు.

        ఏ కథయినా ఒకే పాయింటు లేదా సమస్యతో వుంటుంది. అశోకన్ పాత్రకి పొట్టి తనం అనే పాయింటుని ఎస్టాబ్లిష్ చేశాక, మళ్ళీ రంగు తక్కువ, చిరుద్యోగం అనే లోపాలు కూడా కలపడంతో పొట్టి తనమనే పాయింటు తేలిపోయింది. ఇంతే కాదు, జాతకమనే ఇంకో పాయింటు కూడా పొట్టితనం పాయింటుతో క్లాష్ అయి ఇదేం కథో అర్ధం గాకుండా చేసింది. ఈ కథ పొట్టితనం గురించా, జాతకం గురించా?

        ఈ జాతకం పాయింటు కూడా గందరగోళంగా వుంది. అశోకన్ పెళ్లి చేసుకుంటే మరణ గండం వుందన్నపుడు దానికి విరుగుడు చెట్టుని పెళ్లి చేసుకోవడంగా చెప్పారు. అశోకన్ అరటి చెట్టుని పెళ్లి చేసుకున్నాక జాతక దోషం తొలగిపోయినట్టే. ఆ చెట్టుని తల్లి నరికి పారేస్తే జాతకం ప్రకారం మరణం గొడవ కూడా వదిలిపోయి క్లీన్ చిట్ వచ్చేసినట్టే. వెంటనే శ్యామని కాకపోతే ఇంకో తన సైజు అమ్మాయిని పెళ్లి చేసుకుని శోభనం జరుపుకో వచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఎక్కడో సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో సినిమా నటి విషయమే వుంది. ఐశ్వర్యా రాయ్ కి కుజ దోషం వల్ల విడాకులో, మరణమో పొంచి వుందని, దోష నివారణకి రెండు చెట్లతో పెళ్లి జరిపించి, ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ తో జరిపించారు.

        కానీ అశోకన్ ఏం చేస్తాడంటే, అరటి చెట్టుకి తాళి కట్టాకా, అరటి చెట్టునే భార్యగా తల్చుకుంటూ వూహాల్లో కాపురం చేస్తూంటాడు. తల్లి చెట్టు కొట్టేస్తే దోష నాశనమైందని సంతోషించక పిచ్చివాడయి పోతాడు. తండ్రి పెరట్లో రెండు మొక్కలు నాటితే, మళ్ళీ పిల్లలు పుట్టారని ఇంకో ప్రహసనం మొదలెడతాడు. వాటికి శివగామి, శివగంగ అని పేర్లు పెట్టుకుని, వాటి మీద వర్షం కూడా పడకుండా కాపాడుకుంటాడు. ఆ ‘పిల్లలే’ లోకంగా జీవిస్తాడు. పెళ్లి చేసుకుంటే భార్య ఈ ‘పిల్లల్ని’ చూడదని భీష్మించుకుంటాడు…ఇలా న్యూసెన్స్ చేస్తాడు.

        ఇక స్నేహితులే  మెడలు వంచి తాము చూసిన సంబంధం ఇందూ (నజ్రియా నజీమ్) తో పెళ్లి జరిపించి అవతల పడేస్తారు. ఇందూని అడిగినప్పుడు పొట్టితనాన్ని ప్రశ్నించదు. పొట్టితనం ప్రశ్నకాకపోతే ఈ కథంతా ఎందుకు? ఇప్పుడు పొడుగు అమ్మాయి ఇందూని చేసుకున్న తనని చూసి నల్గురూ నవ్వితే తట్టుకోగలడా? సహజంగా ఏ సైజుకా సైజు ఈడూ జోడూ చూసి పెద్దలు పెళ్ళిళ్ళు చేస్తారు. అశోకన్ పేరెంట్స్ కి ఈ కామన్ సెన్సు కూడా లేకుండా ఏళ్ల తరబడి సంబంధాలు చూడ్డం.   

        ఈ జాతక దోషం గతంలో సంబంధాలు చూసినప్పుడు లేదా? ఇప్పుడే దేవుడు అర్జెంటుగా లేచి అప్డేట్ చేశాడా? సెంటిమెంట్లకి లాజిక్ కూడా అవసరం. ఇలా కథలోనే ఇన్నిదోషాలున్నాయి. దీంతో కథనంలో విషయం లేకుండా పోయింది. మొదటి అరగంట కథలో అనుపమా పరమేశ్వరన్ ఒకటి  రెండు సీన్లు పూర్తి చేసుకుని వెళ్లిపోయాక, చివర్లో నజ్రియా నజీమ్ వచ్చి రెండు సీన్లలో కన్పించే వరకూ, మధ్యలో దాదాపు గంటన్నర పాటు చెట్లతో అశోకన్ అర్ధం పర్ధం లేని కథే.

సికిందర్

 

- Advertisement -

Related Posts

నాని చేసిన పొరపాటు – ‘వి’ – రివ్యూ

రచన - దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ తారాగణం : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ తదితరులు సంగీతం : తమన్, అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం...

రివ్యూ : నాని ‘V’.. జస్ట్ ఏ రివేంజ్ స్టోరీ.. నాట్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్

నాని సినిమా మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయింది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో తప్పని పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ...

స్క్రీన్ టు స్క్రీన్ సస్పెన్స్ – ‘సీయూ సూన్’ మలయాళం రివ్యూ

రచన, కూర్పు, దర్శకత్వం : మహేష్ నారాయణ్ తారాగణం : ఫహాద్ ఫాజిల్, దర్శనా రాజేంద్రన్, రోషన్ మాథ్యీవ్, అమాల్డా లిజ్, మాలా పార్వతి తదితరులు సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : సబిన్...

Recent Posts

పోనీ దేశానికి ప్రధానిగా చంద్రబాబును ప్రకటించండి  !

గొప్పలు చెప్పుకోవడం అవసరమే.. కాదని ఎవరూ అనరు.  కానీ చెప్పుకునేదేదో చేసిన గొప్పలు చెప్పుకుంటే బాగుంటుందనే అందరూ అంటారు.  కానీ రాజకీయాల్లో చాలామంది చేసే గొప్పలు పెద్దగా ఉండవు కాబట్టి చేయని గొప్పలను,...

Mirnaa hd photos

Tamil Actress Mirnaa hd photos Check out, Mirnaa hd photos Movie shooting spot photos, Actress Kollywood Mirnaa hd photos

వామ్మో మళ్లీ మొదలెట్టేసిందిగా… రేణూ దేశాయ్ స్టన్నింగ్ లుక్

రేణూ దేశాయ్ సినిమాల్లో నటించి చాలా కాలం అవుతోంది. బుల్లితెరపై కనిపించి కూడా చాలా రోజులే అవుతోంది. వెండితెర, బుల్లితెరకు రేణూ దేశాయ్ సుపరిచితురాలే. అయితే వెబ్ సిరీస్ అనే రంగానికి ఓటీటీ...

పార్లమెంట్ లైవ్ అప్‌డేట్స్: రాజ్యసభలో వాయిస్ ఓటు ద్వారా రెండు వ్యవసాయ బిల్లులు ఆమోదించబడ్డాయి

పార్లమెంట్ లైవ్ అప్‌డేట్స్: రైతు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు, 2020, మరియు ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల బిల్లుపై రైతు (సాధికారత మరియు రక్షణ)...

గంటా టీడీపీకి గుడ్ బై చెప్పేముందు ఇంత పెద్ద స్కెచ్ ఉందన్నమాట.. జగన్ మామూలోడు కాదు !

తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో ఒకరు, విశాఖ రాజకీయాల్లో ముఖ్యుడు గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడతారనే వార్తలు చాలారోజుల నుండి ప్రచారంలో ఉన్నాయి.  కానీ ఇంకా ఆయన బయటికి వెళ్లలేదు.  వైసీపీతో ఇంకా...

Soundarya Sharma birthday pics

Hindi ActressSoundarya Sharma birthday pics Check out, Soundarya Sharma birthday pics Movie shooting spot photos, Actress Bollywood Soundarya Sharma birthday pics.

అంటే.. చంద్రబాబే లోకేష్‌ను జైల్లో వేయించాలనా మీరనేది !?

వైసీపీ నేతలు లోకేష్ విషయంలో ఎప్పుడూ కామెడీ చేస్తూనే ఉంటారు.  లోకేష్ మీద వారు సీరియస్ గా మాట్లాడినా అది ఒక్కోసారి జనంలోకి పిచ్చ కామెడీగా వెళుతుంటుంది.  అది కూడ వైసీపీ శ్రేణుల్లోకే...

భారత్ దళాలను ఏదుర్కోలేక గూఢఛారులని ఆశ్రయిస్తున్న చైనా

ఢిల్లీ: నక్క జిత్తుల చైనా మరొక పన్నాగానికి పాల్పడుతున్నది. ఇండియా ని ఎదుర్కోటానికి గూఢచర్యాన్ని ఎన్నుకుంది. డోక్లాం  మరియు గాల్వన్లలో సైనిక మొహరింపుకు సంభందించిన సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను...

Shama sikander new photos

Hindi Actress Shama sikander new photos Check out, Shama sikander new photos Movie shooting spot photos, Actress Bollywood Shama sikander new photos.

జగన్ ఈ ఒక్క పని చేస్తే చాలు.. చంద్రబాబు కూడ ‘జై జగన్’ అనడం గ్యారెంటీ !

అధికార పక్షం మీద ఆరోపణలు చేయాలనుకున్నప్పుడు ప్రతిపక్షాలు ప్రధానంగా లేవనెత్తే అంశం తమ పార్టీ గెలిచిన నియోజకవర్గాల మీద పాలక పక్షం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, మా నియోజకవర్గాల్లో అభివృద్ది పడకేసింది, ఉద్దేశ్యపూర్వకంగానే నిధులు...

Entertainment

Mirnaa hd photos

Tamil Actress Mirnaa hd photos Check out, Mirnaa hd photos Movie shooting spot photos, Actress Kollywood Mirnaa hd photos

వామ్మో మళ్లీ మొదలెట్టేసిందిగా… రేణూ దేశాయ్ స్టన్నింగ్ లుక్

రేణూ దేశాయ్ సినిమాల్లో నటించి చాలా కాలం అవుతోంది. బుల్లితెరపై కనిపించి కూడా చాలా రోజులే అవుతోంది. వెండితెర, బుల్లితెరకు రేణూ దేశాయ్ సుపరిచితురాలే. అయితే వెబ్ సిరీస్ అనే రంగానికి ఓటీటీ...

Soundarya Sharma birthday pics

Hindi ActressSoundarya Sharma birthday pics Check out, Soundarya Sharma birthday pics Movie shooting spot photos, Actress Bollywood Soundarya Sharma birthday pics.

Shama sikander new photos

Hindi Actress Shama sikander new photos Check out, Shama sikander new photos Movie shooting spot photos, Actress Bollywood Shama sikander new photos.

లాస్యపై కౌంటర్.. మళ్లీ డిలీట్ చేసిన గీతామాధురి

బిగ్‌బాస్ షోలో ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.. ఏది చేసినా అన్ని రకాలుగా ఆలోచించి చేయాలి. మాట తూలితే జరిగే నష్టం గురించి ఊహించలేం. అలా మాటలు తూలే కొందరు ఎలిమినేట్...

రూంకి పిలిచి బట్టలు విప్పి.. డైరెక్టర్‌ భాగోతం బయటపెట్టిన పాయల్ ఘోష్

ప్రయాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ ఘోష్. ఆపై కొన్ని చిత్రాలు చేసింది కూడా. అయితే ఊసరవెల్లి చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఈ...

జబర్దస్త్ నుంచి అవినాష్ వెళ్లడంతో అతను ఫుల్ హ్యాపీ.. సన్మానాలు కూడా...

జబర్దస్త్ అవినాష్ బిగ్‌బాస్ 4 తెలుగు ‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అలా జబర్దస్త్‌ను వీడి బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే నానా తంటాలు పడ్డాడని తెలుస్తోంది. మల్లెమాల వారి అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు...

ఆ హీరోయిన్‌ను చాలా మంది దాని గురించే అడుగుతున్నారట..!!

ఒక్క సినిమా చాలు హీరో, హీరోయిన్ల ఫేట్ మారిపోవడానికి. అది మంచికైనా సరే చెడుకైనా సరే. ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ అనుభవించిన వారున్నారు. అదే ఒక్క సినిమాతో పాతాళంలో కూరుకుపోయిన వారున్నారు....

Bigg Boss 4 Telugu : ఓహో డబుల్ ఎలిమినేషన్ కథ...

బిగ్‌బాస్ 4 తెలుగు రెండో వారంలో రెండు ఎలిమినేషన్స్ అని నాగార్జున ఓ బాంబ్ పేల్చాడు. నిజంగానే ఒక వేళ డబుల్ ఎలిమినేషన్స్ ఉంటే ప్రేక్షకులకు అంత సులభంగా చెప్పేసేవాడు కాదు. డబుల్...

సంక్రాంతి బరిలో అక్కినేని సోదరులు.. బాక్సాఫీస్ లెక్కలు మాత్రం ఆ సినిమాకే..!

క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’. అక్కినేని నాగ చైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం టాకీ...