విజయ్ దూకుడు మామూలుగా లేదు.. మరో డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రౌడీ హీరో?

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుని ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.

తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కాశ్మీర్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది.త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాలో పాల్గొనబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా విజయ్ దేవరకొండ తాజాగా మరొక డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ ఇంద్రగంటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన తెలియజేయనున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాని అధికారకంగా ప్రకటించడమే కాకుండా,ఈ సినిమాలో నటీనటుల ఇతర సాంకేతిక నిపుణుల గురించి కూడా తెలియ చేయనున్నట్లు సమాచారం.