NTR : అసలు కొమరం భీమ్ చేయాల్సింది ఆ హీరో అట…. చివరకు తారక్ వద్దకు…!

NTR : కొమరం భీమ్ అనగానే ఎన్టీఆర్ ను తప్ప మరెవరిని ఊహించుకోలేము. అంతలా ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంది. ప్రేక్షకులు ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ అభినయానికి కళ్ళు చెమర్చని వారు ఉండరు. అంతలా ఒకే సన్నివేశంలో బాధ, నొప్పి చూపిస్తూనే తల వంచని ఆత్మ గౌరవాన్ని చూపిస్తాడు. ఇవన్నీ ఏకకాలంలో ఒకే సన్నివేశంలో చూపించడం ఒక. నటుడికి పెద్ద సవాలే కానీ ఎన్టీఆర్ మాత్రం అవలీలగా నటించేసాడు.

తన కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మన్స్ గా ఈ సినిమాలో నటనను చెప్పొచ్చు. ఇక ప్రేక్షకులు కొమరం భీమ్ పాత్రను బాగా ఓన్ చేసుకున్నారు. ఉత్తరాదిలో ఏకంగా విగ్రహం పెట్టి పాలాభిషేకాలు చేసేంతగా ఎన్టీఆర్ కు వాళ్లు కనెక్ట్ అయ్యారు. ఇక సినిమాలో ఈ పాత్రకోసం మొదటగా హీరో సూర్య ని అనుకున్నారట భీమ్ గా సూర్యని , రామరాజు గా చరణ్ ను అనుకున్నారట ఆ తర్వాత కొమరం భీమ్ కోసం ధనుష్ పేరు కూడా పరిశీలించారట ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా ఆలోచించారట కానీ చివరకు ఈ పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని రాజమౌళి ఎన్టీఆర్ కు కథ చెప్పారంట.

ఇక ఎన్టీఆర్ కు కథ బాగా నచ్చడం అందులో భీమ్ పాత్ర బాగా నచ్చడంతో ఓకే చేసారు. ఇక కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనకు రాజమౌళి కూడా ఫిదా అయ్యారు. ఆ పాటలో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ ఇండియాలో మరే నటుడు చేయలేడని చెప్పేసారు. అయితే ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు రామ్ చరణ్ కు పడితే అటు ఎన్టీఆర్ పాత్ర మాత్రం ఎన్నో ఎమోషన్స్ క్యారీ చేస్తూ చివరి వరకు సినిమాను నడిపిస్తూ ఉంటుంది. రామ్ పాత్రలో కంటే భీమ్ పాత్రలో ఎక్కువ ఎమోషన్స్, ఇంకా అమాయకత్వం ఉంటాయి అందుకే ఆ పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని భావించిన జక్కన్న నమ్మకం ఎన్టీఆర్ నిలబెట్టాడు.