‘దేవర’లో ఆ సర్‌ప్రైజ్ ఏంటో.?

జూనియర్ ఎన్టీయార్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా రిలీజ్ డేట్ విషయమై కొంత కన్‌ఫ్యూజన్ అలాగే కొనసాగుతూ వస్తోంది. ఈ ఏప్రిల్‌లోనే విడుదలవ్వాల్సిన సినిమా.. బాగా వెనక్కి వెళ్ళిపోయింది.! ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందన్న ప్రచారమైతే జరుగుతోంది.

ఇదిలా వుంటే, జూనియర్ ఎన్టీయార్ తాజాగా ముంబైకి వెళ్ళి ‘వార్-2’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్న సినిమా ఇది. జూనియర్ ఎన్టీయార్‌కి ఇదే తొలి స్ట్రెయిట్ హిందీ మూవీ.

ఇక, అసలు విషయానికొస్తే, ‘దేవర’ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడట. అదీ, ‘దేవర’ సినిమా ఫస్ట్ పార్ట్ ముగింపు సందర్భంగా వచ్చే సీన్ అని తెలుస్తోంది.

‘దేవర’ సినిమాని రెండు పార్టులుగా డిజైన్ చేశారు. వాస్తవానికి ఒకటే పార్ట్ అనుకున్నా, అనివార్య కారణాల వల్ల రెండు పార్టులుగా చేస్తున్నారు. మూడోది కూడా వుండొచ్చని అంటున్నారనుకోండి.. అది వేరే సంగతి.

‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే రేంజ్‌లో మొదటి పార్ట్‌కీ, రెండో పార్టృకీ మధ్యన లింక్ పెట్టబోతున్నారట. ఆ లింక్ కోసం ఓ సర్‌ప్రైజ్ యాక్టర్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఎవరా యాక్టర్.? ఏంటా కథ.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

‘దేవర’లో జూనియర్ ఎన్టీయార్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఆమెకిదే తొలి సినిమా.