చిన్న సినిమాకి లైన్ క్లియర్ చేసుకున్న ‘పవర్‌ఫుల్’ డైరెక్టర్.!

ఆయనో ‘పవర్ ఫుల్’ సినిమాకి దర్శకత్వం వహించాల్సి వుంది. హీరోగారేమో రకరకాల ఇతర వ్యాపకాలతో బిజీ అయిపోయారు. పైగా, ఆ హీరోగారి ప్రస్తుత సినిమా సెట్స్ మీద వుంది.. అది పూర్తవడానికి సమయం పడుతంది. తదుపరి సినిమాకి ఎంత సమయం తీసుకుంటాడో తెలియదు. దాంతో, ఆ హీరోగారితో సినిమాకి కమిట్ అయి, వేరే ఏ సినిమా కూడా చేయలేకుండా ఖాళీగా వున్న సదరు పవర్‌ఫుల్ డైరెక్టర్, తాజాగా ఓ కథని సిద్ధం చేసుకుని, చిన్న సినిమా చెసెయ్యడానికి సన్నాహాలు పూర్తి చేసేసుకున్నాడట.

ఇంతలోనే, ‘అబ్బే, అనుకున్న సినిమా చేసేద్దాం..’ అంటూ ఆ పవర్‌ఫుల్ హీరో నుంచి పిలుపు రావడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. సదరు నిర్మాణ సంస్థ ఇటు హీరోకీ, డైరెక్టర్‌కీ మధ్య నలిగిపోతోందని సమాచారమ్ ఓ చిన్న హీరోకి సదరు పవర్‌ఫుల్ డైరెక్టర్ ఇచ్చేసిన మాట ఏమవుతుందో ఏమోగానీ, ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదని ఆ పవర్‌ఫుల్ డైరెక్టర్ గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవర్‌ఫుల్ కాంబో అనౌన్స్ అయి వుండకపోతే, ఈపాటికి ఓ సినిమా రిలీజ్ చేసేసుకుని వుండేవాడా డైరెక్టర్.