మంచు మనోజ్ సినిమాలు చేయకపోవడానికి అదే కారణం..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మంచు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో మంచు మనోజ్ ఈమధ్య ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.అయితే ఈయన చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఏంటి అనే విషయాల గురించి మాత్రం ఎక్కడా తెలియడం లేదు. అయితే మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ప్రకటించినప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వెలబడలేదు.

ఇలా ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు సైతం ఈ సినిమా గురించి ఆలోచించడం మానేశారు.ఇకపోతే తాజాగా డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మనోజ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. మనోజ్ నటిస్తున్న అహం బ్రహ్మాస్మి పనుల కారణంగా తాను ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేకపోయానని తెలిపారు. అయితే ఈ సినిమా ఆలస్యం కావడానికి గల కారణాలను కూడా ఈయన తెలియజేశారు.

ఈ క్రమంలోనే రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ ఈయన రాజకీయాలలోకి వెళ్లే అవకాశం ఉందని రాజకీయాలలోకి వెళ్లడం వల్లే ఈ సినిమాలో ఆలస్యం అవుతున్నాయి అంటూ పేర్కొన్నారు.ఇలా రాజకీయాల కారణంగానే మనోజ్ ఇండస్ట్రీకి దూరమయ్యారంటూ నాగేశ్వర్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే ఈయన రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయవారసురాలైన భూమా మౌనికను కూడా ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా మనకు తెలిసిందే. అయితే ఈ విషయాలన్నింటినీ మంచి రోజు చూసుకుని అందరికీ చెబుతానని మనోజ్ వెల్లడించారు.