RC 15 ఇంకా ఎన్నాళ్ళీలా.. పూర్తవుతుందా?

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరుణ్ క్రేజ్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో ఆయన చేయబోయే సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ‘ఆర్ సీ 15’ దిగ్గజ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియ‌న్ స్థాయిలో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోంది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకోనున్న‌ ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్విస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన విషయం ఏంటంటే… ఆర్సీ 15 నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్, రాజమండ్రి నగరాల్లో జరగనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం. ఇందులో చ‌ర‌ణ్ లేకుండా ప్ర‌ధాన పాత్ర‌ల‌పై ద‌ర్శ‌కుడు శంక‌ర్ కీల‌క స‌న్నివేశాల‌ను షూట్ చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ను గత రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. అయినా ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు పూర్తి చేస్తారో ఫుల్ వెయిట్ చేస్తూ నిరాశలోనే ఉన్నారు. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు శంకర్.. ఈ సినిమా షూటింగ్ను కొనసాగిస్తూనే.. యూనివర్సల్ స్టార్ కమల్హాసన్తో భారతీయుడు 2 షూటింగ్ చేస్తున్నారు. అది కూడా ఆలస్యమవ్వడానికి ఓ కారణం అని చెప్పొచ్చు.

ఇకపోతే ఈ సినిమాలో చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా, అవినీతిని ఎదురించే పోరాట యోధుడిగా డ్యుయ‌ల్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. చరణ్ ఓల్డ్ క్యారెక్టర్కు హీరోయిన్‌గా అంజలి నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విల‌న్‌గా న‌టించ‌బోతున్నారు. ఇందులో ఆయన పాత్ర ఎంతో కీలకంగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుంది.

పూర్తి పొలిటికల్ టచ్లో ఈ సినిమాలు న‌వీన్‌చంద్ర‌, సునీల్‌, అంజ‌లి కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌నున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. పిజ్జా, పేట, పెంగ్విన్‌, మహాన్‌ వంటి చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో తెలుగు, హిందీతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.