చాలాకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత.. కారణమేంటి..?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన వారిలో సమంత కూడా ఒకరు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత ఆ సినిమా హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇలా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటుంది.

తన జీవితములో జరిగే ప్రతీ విషయం గురించి అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఇలా సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసే సమంత తన అందమైన ఫోటోలు కూడా తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత చాలా విమర్శలు ఎదుర్కొంది. అంతే కాకుండా నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత వేసుకునే దుస్తులు విషయంలో కూడ చాల విమర్శలు ఎదుర్కొనేది. అయితే సమంత మాత్రం తనని ట్రోల్ చేసేవారికి చాలా ఘాటుగా సమాధానాలు ఇచ్చేది.

ఇలా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత గత కొన్ని రోజులుగా ఒక్క పోస్ట్ కూడా షేర్ చేయలేదు. జూలై 21వ తేదీన ఇంస్టాగ్రామ్ లో చివరిసారిగా పోస్ట్ షేర్ చేసింది. ఆ తర్వాత సమంత చేసిన పోస్ట్ లు ఎక్కడ కనిపించలేదు. అయితే ఇలా ఉన్నపలంగా సమంత సోషల్ మీడియాకు దూరం కావటానికి కారణమేంటని ఆమె అభిమానులు ఆలోచనలో పడ్డారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు ఎదురయ్యే విమర్శల వల్లే సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా యశోద ఖుషి వంటి సినిమాలలో కూడా నటిస్తూ మరొకవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.