Samantha: మరో అనారోగ్య సమస్యలో సామ్… తనకే ఎందుకిలా అంటున్న ఫ్యాన్స్…. ఏమైందంటే?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు ఈమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ డిప్రెషన్ నుంచి బయటపడే తిరిగి సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్న తరుణంలో సమంత మయోసైటీసిస్ వ్యాధికి గురి అయ్యారు.

ఈ వ్యాధి కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది ఇక సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసిన ఖుషి సినిమా ద్వారా వెండి తెరపై సందడి చేశారు. ఈ సినిమా తర్వాత సమంత తిరిగి వెండితెరపై కనిపించలేదని చెప్పాలి. ఇక ఈ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత సమంత తిరిగే పలు సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారని చెప్పారు కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుల గురించి ఎలాంటి అప్డేట్స్ మాత్రం లేవని చెప్పాలి.

ఇలా సమంత వెండితెరకు దూరంగా ఉంటున్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈమె జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు అయితే ఈ ఫోటోని షేర్ చేసిన సమంత మరో వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేశారు.

ఇలా వర్కౌట్ చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ..చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటుంది అంటూ క్యాప్షన్ పెట్టడమే కాకుండా ఒక సాడ్ ఎమోజిని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత చికెన్ గునియా వ్యాధితో బాధపడుతున్నారా అంటూ అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా ఈ సమస్య నుంచి తొందరగా బయటపడాలని కోరుకుంటున్నారు. ఇకపోతే మరి కొంతమంది అభిమానులు గత కొద్దిరోజులుగా సమంత ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ సమంతకి ఎందుకిలా జరుగుతుంది అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.