పుష్ప 2లో సాయి పల్లవి… క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఊహించని విధంగా నార్త్ ఇండస్ట్రీలో కూడా కలెక్షన్లను రాబట్టి ఎంతో మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

ఇకపోతే మరో కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని రష్మిక హింట్ ఇచ్చారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఆత్రుతలో అభిమానులు ఉన్నారు.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మలయాళ నటుడు ఫహిద్ ఫాజిల్ మధ్య గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుకాకుండానే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నటుడు విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నటి సాయి పల్లవి కూడా 10 నిమిషాల పాటు గెస్ట్ రోల్ లో కనిపించని ఉందని సమాచారం.

ఇలా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో తాజాగా నిర్మాతలలోఒకరైన రవిశంకర్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర పై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలో వారి లుక్ ఉండబోతుందని అయితే కొంత మార్పులు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇందులో సాయి పల్లవి నటించలేదని ఈయన క్లారిటీ ఇచ్చారు.