యూనివర్సిటీలో ఆర్జీవీ బూతు పాఠాలు

ప్రస్తుతం సొసైటీలో ఆర్జీవీ అంటే కేరాఫ్ కాంట్రవర్సీ అనే మాట చెప్పేవారు ఎక్కువ మంది ఉంటారు. నిత్యం ఏదో అంశంలో తలదూర్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటం ఆర్జీవీ నైజం అని చెప్పాలి. ఎక్కువగా ఐడెంటిటి కోరుకునే ఆర్జీవీ దానికోసం అన్ని రకాల పనులు చేస్తాడు. సమాజాన్ని లెక్కచేయకుండా తనని నచ్చినట్లు బ్రతకాలని అనుకుంటాడు. ఇక ఎవరైనా అతని మార్గాన్ని ప్రశ్నించిన, అతని అభిప్రాయాలని విమర్శించిన వారిపై చెప్పుకోలేని రీతిలో మరోసారి ఎవరూ తన జోలికి వెళ్ళలేని స్థాయిలో కౌంటర్లు వేస్తూ ఉంటారు.

ట్విట్టర్ లో నిత్యం హడావిడి చేస్తూ ఉండే వర్మతో పెట్టుకోవడానికి ఎవరూ ట్రై చేయరు. అయితే ఆర్జీవీ దృష్టిలో పడితే ఫేమస్ అయిపోవచ్చని కొంతమంది అమ్మాయిలూ అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు ప్రత్యేకంగా ఆర్జీవీని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆర్జీవీ భావజాలాన్ని అభిమానించే వారు ఈ జెనరేషన్ లో చాలా మంది ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో కుక్కల దాడిలో చిన్నారి బాలుడు చనిపోయిన ఘటనపై కాస్తా మానవతా దృక్పథంలో ఆర్జీవీ పని చేయడం అందరిని షాక్ కి గురిచేసింది.

ఆర్జీవీలో కూడా మంచోడు ఉన్నాడు అనుకునే లోపే మరో కాంట్రవర్సీని క్రియేట్ చేశాడు. నాగార్జున యూనివర్సిటీకి ఓ కార్యక్రమం కోసం చీఫ్ గెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ వెళ్ళారు. అక్కడ స్టూడెంట్స్ అందరికి తనదైన స్టైల్ లో ఆర్జీవీ శృంగార పాఠాలు చెప్పడం సంచలనంగా మారింది. టీచర్లు, తల్లిదండ్రులు చెప్పే విషయాలని పట్టించుకోకుండా తమకి నచ్చిన విధంగా బ్రతకాలని విద్యార్ధులకి ఆర్జీవీ సూచించారు. సెక్స్, ఆహారం మాత్రమే మనిషికి సంతోషాన్ని ఇస్తాయని ఈ సందర్భంగా ఆర్జీవీ చెప్పడం విశేషం. అయితే సంతోషాన్ని కలిగించే విషయాలని ఏదో ఒక కారణం చూపించి తప్పని, చేయకూడదని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారని అన్నారు.

చనిపోయిన తర్వాత స్వర్గంలో రంభ, ఊర్వశీ, మేనకలు ఉంటారని అక్కడ సంతోషం ఉంటుందని పెద్దలు చెబుతారని అన్నారు. అయితే అక్కడ ఉంటుందో లేదో తెలియని దానికోసం ఎప్పుడు తన సంతోషాన్ని ఎందుకు వదులుకోవడం ఇష్టం లేక నాకు ఆనందాన్ని ఇచ్చేవాన్ని చేస్తున్నా అని అన్నారు. తాగాలనుకుంటే తాగేయండి, తినాలనుకుంటే తినేయండి, సెక్స్ చేయాలని అనిపిస్తే చేసేయండి అంటే కాని ఎవరో చెప్పారని మీ సంతోషాలని వదులుకోవద్దు అని ఉపదేశం చేశారు. అలాగే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎప్పుడైనా జీవితంలో పైకి వస్తారని, హార్ట్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ముఖ్యం అని అన్నారు. అయితే వర్మ చెప్పిన సందేశంలో కొన్ని మంచి విషయాలు ఉన్నా కూడా మరికొన్ని ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలు కూడా ఉండటం విశేషం. అయితే యూనివర్సిటీలో ఇలాంటి శృంగార పాఠాలు చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Ram Gopal Varma sensational comments : నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు RGV కామపాఠం - TV9