ఆదిపురుష్ ఇలా అయ్యేందుకు ప్రభాస్ కూడా కారణమే: ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమకాలీన చిత్రాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గరు. అవి వివాదానికి దారి తీస్తాయి అని తెలిసినా తన శైలి తనదే.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’ టీజర్ పైన అనేక వివాదాలు జరుగుతున్నాయి. అయితే వీటిపై రాంగోపాల్ వర్మ స్పందించారు. రామాయణాన్ని స్టార్ హీరోతో ఒక కార్టూన్ చిత్రంగా చూపించడం పై ఎంతోమంది తం నిరుత్సాహాన్ని వెళ్ళగక్కారు. అయితే ఈ విషయంలో అందరూ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ పైన ఫైర్ అయ్యారు.

ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాని హీరో చిత్రాన్ని ఇలా చేయడం జీర్ణించుకోలేక దూషణలకు కూడా దిగుతున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ దీనిపై మాట్లాడుతూ ఈ టీజర్ ఇలా ఉండడం… దీని మేకింగ్ లో జరిగిన ప్రతి విషయం ప్రభాస్ కు తెలిసే ఉంటుందని అంటున్నారు. హీరోకి తెలియకుండా ఏదీ జరగదని… ఈ టీజర్ పై ఎలాంటి రియాక్షన్ వచ్చినా దానికి ప్రభాస్ కూడా బాధ్యుడే అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. మరి ప్రభాస్ కు టీజర్ ఇలా బ్యాక్ ఫైర్ అవుతుందని ముందే తెలుసా?