Nithiin: నితిన్ కు హిట్ కావాలి.. అంటే అతనే రావాలి

Nithiin: హీరో నితిన్ కు ఈ ఏడాది రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘చెక్’ డిజాస్టర్ అయితే ఇటీవల వచ్చిన ‘రంగ్ దే’ ఫ్లాప్ అయింది. దీంతో నితిన్ కెరీర్ మరోసారి గాడి తప్పినట్టైంది. ప్రజెంట్ ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ సినిమా చేస్తున్నారు.

Nithiin to team up with Venky Kudumula again 1

హిందీ ‘అంధాధూన్’కు ఇది రీమేక్. పూర్తిగా ప్రయోగం. బేడిసికొడితే నష్టం తప్పదు. ఇలాంటి టైంలోనే కమర్షియల్ సినిమాలను నమ్ముకోవాలి. అవి అయితే పరాజయం చెందే ఛాన్సులు తక్కువ. అందుకే నితిన్ ఒక మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ఒకటి చేయాలని చూస్తున్నారట.

ఆ బాధ్యతను వెంకీ కుడుములకు అప్పగించారట. వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత ‘భీష్మ’ సినిమాతో హిట్ అందుకున్నారు నితిన్. ఆ చిత్రానికి దర్శకుడు వెంకీ కుడుముల. ఆ సినిమాతో నితిన్ మార్కెట్ కూడ కుదురుకుంది.

అందుకే ఈసారి కూడ తన హిట్ బాధ్యతను వెంకీ కుడుములు మీద పెట్టేస్తున్నారట. ఇద్దరి నడుమా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.