“వాల్తేరు వీరయ్య” పై లేటెస్ట్ గాసిప్స్.!

టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి మాస్ లో క్రేజీ హైప్ ఉన్న ఈ చిత్రంతో అసలైన ఫీస్ట్ తమకి దక్కుతుంది అని మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి అలాగే ఈ సినిమాతో పాటుగా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో అన్ని కూడా తమ రిలీజ్ డేట్ లు ఇచ్చేసారు. ఇక మిగిలి ఉంది మాత్రం వాల్తేరు వీరయ్య మాత్రమే.. దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ అప్డేట్ ఈ రానున్న మూడు నాలుగు రోజుల్లో వచ్చే ఛాన్స్ ఉందని కొన్ని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. అలాగే దీనితో పాటుగా చిత్ర యూనిట్ ఫ్రాన్స్ దేశానికీ కూడా వెళ్లినట్టు తెలుస్తుంది. ఇప్పుడు  ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం జనవరి 13 అనే అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తూ ఉండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.