Home News విజయ్ సేతుపతి సరసన రణబీర్ కపూర్ మాజీ ప్రేయసి !

విజయ్ సేతుపతి సరసన రణబీర్ కపూర్ మాజీ ప్రేయసి !

‘మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి’ తమిళనాడులోనే కాదు దేశంలోనే ఈ జెనరేషన్ అత్యుత్తమ నటుల్లో ఒకడుగా గుర్తింపు పొందాడు . ఇంతింతై వటుడింతై అన్నట్లుగా షార్ట్ ఫిలిమ్స్ నుండి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా టాప్ లిస్ట్ లో కి చేరాడు.సేతుపతి ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా వస్తున్న “మాస్టర్ ” చిత్రంలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తమిళ్ లో ఆయన వరసగా మమనిథన్, యతుమ్ యురే యవరుమ్ కెలిర్ మరియు తుగ్లక్ దర్బార్ వంటి చిత్రాలు కూడా చేస్తున్నాడు. ఈ నటుడు తెలుగులో మెగా హీరో వైష్ణవ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’లో విలన్ గా నటించాడు.

Katrina Kaif Will Play The Heroine Next To Vijay Sethipathi
Katrina Kaif will play the heroine next to Vijay sethipathi

ఇప్పుడు సేతుపతి చూపు బాలీవుడ్‌పై పడింది. ఒకే సారి రెండు హిందీ చిత్రాలు చేస్తున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘మానగరం’ చిత్రానికి హిందీ రీమేక్‌గా సంతోష్‌ శివన్‌ తెరకెక్కిస్తోన్న ‘ముంబైకర్‌’ చిత్రంతో పాటు ‘అంధాధున్‌’ ఫేం శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో మరో బాలీవుడ్‌ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో సేతుపతి సరసన కథానాయిక కత్రినా కైఫ్‌ నటిస్తున్నట్టు బాలీవుడ్‌ సమాచారం. ఇందులో హీరోయిన్‌ పాత్రకు కత్రినా కైఫ్‌ అయితే బాగుంటుందని భావించి దర్శకుడు ఆమెను ఎంపికచేశారట. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కత్రినా కైఫ్ ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌తో ‘సూర్యవంశీ’, సిద్ధాంత్‌ చతుర్వేదితో ‘ఫోన్‌బూత్‌’ చిత్రం చేస్తున్నారు.

- Advertisement -

Related Posts

అభిజీత్‌, హారికల మ‌ధ్య రిలేష‌న్ ఏంటి.. ఎట్ట‌కేల‌కు ఓపెన్ అయిన దేత్త‌డి

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్రమం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో జూన్ లేదా జూలైలో...

సంప్రదాయ వస్త్రాల్లో శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడకు వెళ్లిన జనసేనాని ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.పూర్తి సంప్రదాయ వస్త్రధారణలో పవన్ కళ్యాణ్...

గెలుపూ ఓటమి మధ్యలో నిమ్మగడ్డ ప్రయాణం-ఎక్కడికి చేరేనో !

ఏపీ హైకోర్టు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల...

త్వరలో రైతులకి తీపికబురు చెప్ప‌నున్న మోడీ సర్కార్ … ఏంటంటే ?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అతి త్వ‌ర‌లో రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్ప‌నుందా ? అంటే.. అందుకు అవున‌నే సమాధానం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం రైతులకు ఏడాదికి రూ.6వేల‌ను కిసాన్ స‌మ్మాన్ నిధి...

Latest News