చరణ్‌ బర్త్‌డే కానుకగా మార్చి27న ‘ఆర్‌సి 16’ పోస్టర్‌!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్‌ లేకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందుతూ వస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటివరకు టైటిల్‌ అనౌన్స్మెంట్‌ తప్పితే మరో అప్డేట్‌ లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కంటే చరణ్‌ తర్వాత చేయబోయే ‘ఆర్‌సి16’ ప్రాజెక్ట్‌ పైనే దృష్టి సారిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసేందుకు ఓ స్పెషల్‌ డేట్‌ ని ఫిక్స్‌ చేశారట మూవీ టీం. ఆ స్పెషల్‌ డేట్‌ మరేదో కాదు.. రామ్‌ చరణ్‌ బర్త్‌ డే రోజు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయడానికి మేకర్స్‌ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 27న రామ్‌ చరణ్‌ బర్త్‌ డే కావడంతో ఆ రోజు ఫ్యాన్స్‌ కి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని రిలీజ్‌ చేయబోతున్నారట.

ఇక ఈ న్యూస్‌ తో ఫాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు. గత ఏడాది రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ‘ఆర్‌సి16’ ప్రాజెక్ట్‌ ని ఓ పోస్టర్‌ ద్వారా అనౌన్స్‌ చేశారు. ఇక ఈ ఏడాది అదే చరణ్‌ బర్త్‌ డే రోజు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని విడుదల చేస్తుండటం విశేషం. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నారు. రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో విలేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ మునిపెన్నడు కనిపించని డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్రపై బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు చెబుతున్నారు.

‘రంగస్థలం’ సినిమాలోని చిట్టిబాబు పాత్రను మించేలా చరణ్‌ రోల్‌ ని డిజైన్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన సాయి పల్లవి నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ సేతుపతి తో పాటు కన్నడ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌ సైతం ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పణలో వృద్ధి సినిమా, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారు.