ఇండస్ట్రీ టాక్ : “వాల్తేరు వీరయ్య” క్రెడిట్ అతడొక్కడికే అంటే ఎలా?

Waltair-Veerayya-Cinima-unit-gave-another-official-update-960x540

గత ఏడాది సంక్రాంతి కానుకగా మాత్రమే కాకుండా ఒక్క కితం ఏడాది లోనే టాలీవుడ్ లో చాలా మల్టీ స్టారర్ చిత్రాలు రావడం వాటిలో చాలా హిట్ కావడం మరికొన్ని దారుణ పరాజయం పాలు కావడం అనేది జరిగింది. మరి ఈ ఏడాది కూడా వచ్చిన మొదటి సూపర్ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మెగా మాస్ మల్టీ స్టారింగ్ చిత్రం “వాల్తేరు వీరయ్య”.

మరి ఈ సినిమా భారీ అంచనాలు నడుమ రావడం పెద్ద హిట్ కూడా కావడం జరిగింది. మరి ఈ చిత్రం అయితే మెగాస్టార్ చిరంజీవి అలాగే మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో రాగ హీరోయిన్స్ శృతి హాసన్ మరియు క్యాథెరిన్ లకు మంచి పాత్రలు కూడా దర్శకుడు బాబీ ఇచ్చాడు.

మరి ఈ చిత్రం అయితే పెద్ద హిట్ కావడంతో ఇది కేవలం మెగాస్టార్ కం బ్యాక్ అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుండడంతో రవితేజ ఫ్యాన్స్ ఏమో కానీ ఇంకొందరు మాత్రం ఇది మల్టీ స్టారర్ సినిమా అయితే చిరంజీవికి మాత్రమే క్రెడిట్ ఇస్తారా హిట్ అయితే వాల్తేరు వీరయ్య చిరంజీవి ఖాతాలో వేసేస్తారు లేకపోతె వేరే వాళ్లపై తోసేస్తారు అంటూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఇది కేవలం చిరు ఒక్కరి విజయమే అని చెప్పడానికి లేదు కానీ చిరంజీవే అసలు రవితేజ లేకపోతె ఈ సినిమా లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక క్రెడిట్స్ కోసం ఎవరో కొందరు గొడవలు పెట్టడం ఇప్పుడు అనవసరం. ప్రస్తుతానికి అయితే చిత్ర యూనిట్ సహా మెగా ఫ్యాన్స్ మరియు రవితేజ ఫ్యాన్స్ సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.