Balakrishna: బాలయ్య అపద్ధం ఆడుతారని అనుకోను.. పేర్ని నాని షాకింగ్ కామెంట్స్!

Balakrishna: ఈ మధ్య కాలంలో ఏపీ గవర్నమెంట్ కు సినిమా వాళ్లకు మధ్య చాలానే జరుగుతున్నాయి. టికెట్స్ రేట్లు విషయంలో ఇటు రాజకీయ నాయకులు ఒకలాగా, సినీ ప్రముఖులు ఒకలాగా, మీడియా స్టేట్‌మెంట్స్ ఇస్తూ హీట్ పెంచుతున్నారు. ఏపీలో సినిమా విడుదల టికెట్ల రేట్ల విషయంలో వివాదం చాలా రోజులుగా కొనసాగుతున్నా కొంతమంది సినిమా వాళ్ళు స్పందిస్తున్నారు కొంతమంది మౌనం వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు అఖండ విషయంలో మాత్రం ఏపీ గవర్నమెంట్ అడ్డంకులు కల్పించలేదు.

ఇక టికెట్ల రేట్ల ఇష్యూ మీద బాలకృష్ణ కూడా ఏపీ గవర్నమెంట్ మీద విమర్శలు చేయకుండా ఆచితూచి మాట్లాడారు. అయితే రీసెంట్ గా చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ పై చర్చించారు. అయితే బాలకృష్ణ ఈ చర్చలకు రాకపోవడంతో బాలయ్య బాబు జగన్ ను కలవనన్నారు అనే రూమర్ స్ప్రెడ్ అయింది. ఈ విషయం పై సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

బాలకృష్ణ అఖండ సినిమా టైంలో నిర్మాతలు హైదరాబాద్ లోని బిల్డర్ నారాయణ ప్రసాద్, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా నన్ను కలవడానికి విజయవాడ వచ్చారని అలాగే బాలకృష్ణ తో ఫోన్ ద్వారా మాట్లాడించారాని , జగన్ ను కలుస్తానని బాలకృష్ణ అన్నారని నాని చెప్పారు. సీఎం జగన్ తో నేను ఆ విషయం ప్రస్థావించినపుడు అఖండ సినిమా విషయంలో బాలకృష్ణ నిర్మాతలకు పూర్తి సహకారం అందించమని జగన్ చెప్పినట్టు పేర్ని నాని తెలిపారు. అఖండ సినిమా విడుదల సమయంలో ఏవైనా ఇబ్బందులు వచ్చుంటే తెలపాలని నాని ప్రశ్నించారు. అపుడు సీఎం జగన్ ను కలుస్తానన్న బాలకృష్ణ ఇపుడు కలవను అని అనుంటారని తాను అనుకోవడం లేదని బాలకృష్ణ అపద్దం చెప్తారని అనుకోవడం లేదని ఆయన మీడియాకు చెప్పారు.