అఫీషియల్ – మొత్తానికి ఆ నటితో ఒకటైన కే ఎల్ రాహుల్.!

ఇండియాలో సినీ మరియు స్పోర్ట్స్ ఇండస్ట్రీ కి బాగా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎపుడు నుంచో సినీ మరియు స్పోర్ట్స్ కి సంబంధించిన అనేకమంది ప్రముఖులు తమ రిలేషన్ షిప్ లో ఉండడం కానీ వారిలో కొంతమంది వాటిని పెళ్ళి వరకు తీసుకెళ్లింది కానీ చాలా మందినే మనం చూడొచ్చు.

మరి అలా తమ ప్రేమాయణం ని ఫైనల్ గా పెళ్లి వరకు తీసుకొచ్చిన యంగ్ జంట ఏదన్నా ఉంది అంటే అది యంగ్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ మరియు బాలీవుడ్ ప్రముఖ నటి అతియా శెట్టి ల జంట అని చెప్పాలి. మరి ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఎప్పుడో లాక్ డౌన్ సమయం నుంచే రూమర్స్ ఉన్నాయి.

మరి వీటిని నిజం చేస్తూ ఇద్దరు బయట తరచుగా కనిపిస్తూ ఉండడం కూడా జరిగింది. ఇక ఫైనల్ గా అయితే ఈ ఇద్దరూ పెళ్లితో ఒకటైనట్టుగా అనౌన్స్ చేశారు. లేటెస్ట్ గా కె ఎల్ రాహుల్ అయితే తమ పెళ్లి ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో సడెన్ షాకిచ్చాడు. తమ ఇద్దరు ఒకటయ్యామని ఆనందం వ్యక్తం చేస్తూ తమ పెళ్లి ఫోటోలు అయితే తాను పెట్టి అనౌన్స్ చేసాడు.

ఇలా మొత్తానికి తన రిలేషన్ పై ఓ శుభం కార్డు వేసాడని చెప్పొచ్చు. మరి అథియా శెట్టి పలు బాలీవుడ్ సినిమాలలో నటించగా మన తెలుగు ఆడియెన్స్ కి అంతగా తెలియకపోవచ్చు ఏమో కానీ ఆమె తండ్రి సునీల్ శెట్టి బాగా తెలిసి ఉండొచ్చు. తమిళ్ సహా తెలుగులో, దర్బార్, మోసగాళ్లు లాంటి చిత్రాల్లో తాను నటించారు. బాలీవుడ్ లో అయితే చెప్పక్కర్లేదు.