RRR: ఎత్తర జెండా పాట సినిమా లో ఉండదా.. కేవలం ప్రచారం కోసమేనా..!

RRR:రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటిసారిగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా జనవరికే పూర్తయి విడుదలకు సిద్ధమైన కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇపుడు మార్చి 25 న విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రచారాన్ని జనవరిలో పెద్ద ఎత్తున చేసిన చిత్ర యూనిట్ ఇపుడు అంత ఖర్చు పెట్టకుండా సినిమా విడుదలకు వారం ఉండగా మొదలుపెడుతోంది.బెంగళూరు నగరం లో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసారు రాజమౌళి ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు మరోవైపు హడావిడి మొదలెట్టారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలను, ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా సినిమాలో ‘ఎత్తరా జెండా’ అనే పాటను విడుదల చేశారు. నెత్తురు మరిగితే ఎత్తరా జెండా’ అంటూ సాగే ఈ పాటను విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంతి, హారిక నారాయణ్ కలిసి పాడారు.ఈ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ ముగ్గురూ కనిపించారు. ఈ పాటలో ముగ్గురు డాన్స్ కు అభిమానులు ఫిదా అయిపోయారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ పాటకు భారి రెస్పాన్స్ కనబరుస్తోంది. అయితే ఇది ఇలా ఉంటే ఈ పాట సినిమాలో ఉండదు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రమోషన్ కోసం మాత్రమే ఈ పాట చిత్రీకరణ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎత్తర జెండా పాటను కంపోజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ లేనప్పటికీ విడుదల తేదీకి, సినిమా తీసే సమయానికి మధ్య సమయం ఉండడంతో ఈ పాటను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ పాట మాత్రమే కాదు ఇది వరకు ఈ సినిమా నుండి దోస్తీ అనే పాట విడుదల చేసిన విషయం తెలిసిందే కదా. ఈ పాటను కూడా సినిమా ప్రమోషన్ కోసమే ఉపయోగిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ వార్త తెలుసుకున్న అభిమానులు మాత్రం తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.