టీజర్ చూడగానే సినిమాని అంచనా వేయొద్దు… ఆది పురుష్ సినిమాపై కృతి సనన్ కామెంట్స్!

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆది పురుష్.రామాయణం ఇతిహాసాల నేపథ్యంలో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. అయితే ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకొని విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ ఎన్నో విమర్శలకు కారణమైంది. ఓం రౌత్ రామాయణాన్ని కించపరిచే విధంగా సినిమా చేశారంటూ ఎంతోమంది ఈ సినిమా టీజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఇందులో రాముడు రావణాసురుడి పాత్రలను రీ షూట్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై నటి కృతి సనన్ స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఆది పురుష్ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ఈ సినిమా చేసినందుకు ప్రతి ఒక్కరు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలిపారు.

ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొంది కానీ టీజర్ చూసి ఎప్పుడు కూడా సినిమాని అంచనా వేయకూడదు అంటూ ఈ సందర్భంగా కృతి సనన్ వెల్లడించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని నటి పేర్కొన్నారు. మన పురాణాలు ఇతిహాసాలను ప్రపంచానికి తెలియచేయడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ ఈ సందర్భంగా కృతి సనన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.