KGF2 : కేజీఎఫ్ చాప్టర్ 1 ఎంత విజయాన్ని అందించిందో అంతకు మించి విజయాన్ని అందుకుంది కేజీ ఎఫ్ 2. బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ తో సౌత్ సినిమా సత్తా చూపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోను జోరుగా వసూళ్లు రాబడుతోంది. ఇక విదేశాల్లో కూడా భాయి వసూళ్ళ తో దూసుకుపోతోంది. ఇక సినిమాలో యష్ రాకింగ్ పెర్ఫార్మన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రశాంత్ నీల్ ప్రేక్షకులను ప్రతి సన్నివేశానికి కట్టి పడేసేలా అద్భుతమైన టేకింగ్ తో సినిమాను బాగా హైలెట్ చేసారు. ఇక హీరో ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ చేసాయి.
ఇక సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమా నుండి. ఇక ఈసినిమాలో నటించిన అంధ వృద్దుడి పాత్ర బాగా హైలైట్ అయి అందరు ఆయన గురించి ఆరాలు మొదలు పెట్టారు.ఇక కృష్ణాజి ఆంధ్ర-కర్ణాటక బార్డర్‌లో పుట్టారాయన. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ సినిమాలు చూసి తానూ ఓ నటుడు అవ్వాలనుకున్నారు. సినిమా మీద ఆసక్తితో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఇక ఒక్క ఛాన్స్ అంటూ డైరెక్టర్స్ చుట్టు తిరిగిన ఫలితం దక్కలేదు. దీంతో ఇక సినిమా వాళ్ల బట్టలు కుట్టే మిత్రుడి సహాయంతో ఆ పనికి కుదిరాడు.
ప్యాంటు కి 8రూపాయలు సంపాదిస్తూ ఆ తర్వాత బీమ్ వెంకటేష్ అనే హీరో మరియు ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడి అతని దగ్గర సినిమా మేనేజ్‌మెంట్ పనికి కుదిరాడు. ఇక ఆ తర్వాత కమలహాసన్ మేకప్ ఆర్టిస్ట్ తో పరిచయం ఏర్పడి అతని దగ్గరా టచ్ అప్ బాయ్ గా చేసాడు. శాంతారామ్ అనే డైరెక్టర్ దగ్గర అసిస్టంట్‌గా చేరి మొత్తం అన్ని పనులు చూసుకునే వారు . తర్వాత శంకర్‌నాగ్‌తో పరిచయం ఏర్పడడం, ఆయనతో పాటు స్టోరీ డిస్కషన్‌లకు వెళ్లడం తో ఓ రోజు శంకర్ నాగ్ కృష్ణాజీని తన దగ్గర పని చేయమని అడగడంతో ఆయన ఒప్పుకున్నారు ఆ సాయంత్రమే 2వేల రూపాయల చెక్కు ఇచ్చారు.
శంకర్ నాగ్ తో సినిమా తరువాత కో డైరెక్టర్ గా కూడా పనిచేసారు ఆ సమయంలోనే కేజీఎఫ్ కు ప్రొవిజనల్ మేనేజర్ గా పనిచేస్తున్న కుమార్ సినిమాకోసం ఫోటోలు పంపమని అడుగగా ఆయన పంపలేదు. ఇక కుమార్ ఫోటోలను తానే పంపారు.ఇక ప్రశాంత్ నీల్ నుండి కాల్ వచ్చింది ఆడిషన్స్ కు రమ్మని. కృష్ణాజి రావు వెళ్లారు ఇక ఏమి చెప్పకుండా డైరెక్టర్ స్క్రీన్ టెస్టు చేసి పంపారు. ఆ తరువాత మేకప్ టెస్టు చేసి పంపారు. కానీ అప్పటికి ఆయన కు స్పష్టత ఇవ్వలేదు. ఇక మళ్ళీ కొన్నాళ్ళకు కేజీఎఫ్ కు రమ్మని ఫోన్ రావడం తో ఆయన సినిమాలో నటించారు.