YS Jagan: వాలంటీర్లు వద్దు…. కార్యకర్తలే ముద్దు…. సత్యం గ్రహించిన జగన్…. కార్యకర్తలకు భరోసా?

YS Jagan: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా జిల్లా అధికార ప్రతినిధులతో కార్యకర్తలతోనూ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన అధినేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఈయన కార్యకర్తల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి తన వెంట నడిచిన వారందరిని కూడా అధికారంలోకి రాగానే మర్చిపోయారు. వారందరినీ పక్కన పెట్టి కేవలం వాలంటీర్లకే అధిక ప్రాధాన్యత కల్పించారు. దీంతో జగన్ పార్టీ ఘరంగా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా ఈ ఓటమికి గల కారణాలను ఆరు నెలల కాలంలో పరిశీలించి వాటన్నింటినీ సరిదిద్దుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా నేతలతో సమావేశమైనటువంటి జగన్ తన పార్టీ ఓటమికి కారణం కార్యకర్తలను దూరం పెట్టడమే అనే సత్యాన్ని గ్రహించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలకు పెద్ద ఎత్తున భరోసా కల్పించారు. కార్యకర్తలను గొప్పగా చూస్తామని .. ఈ విషయంలో తాము నేర్చుకోవాల్సింది ఉందని అంగీకరించారు. పార్టీ కోసం పార్టీ అధికారంలోకి రావడం కోసం నిరంతరం కృషి చేసినటువంటి కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దూరం పెట్టారు. కేవలం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల మీద మాత్రమే ఆయన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి వారిపైనే ఆధారపడ్డారు.

ఇక కార్యకర్తలు ఎంతోమంది కాంట్రాక్టులు తీసుకొని గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు . అయితే వాటి బిల్లులు మంజూరు కోసం నేతలు చుట్టూ తిరిగిన వారికి ప్రయోజనం లేదు చివరికి జగన్ మోహన్ రెడ్డి చెంతన ఉంటే ప్రయోజనం ఏమీ లేదు అనే స్థితికి కార్యకర్తలు వెళ్లిపోయారు. ఇలా జగన్ ఓటమికి కార్యకర్తలే ప్రధాన కారణం అని గుర్తించిన జగన్ ఇప్పుడు కార్యకర్తలకే పెద్ద పీట వేయబోతున్నారని తెలుస్తోంది.