Pawan Kalyan: ఆనందించే సమయమా…. మీకు బాధ్యత లేదా…. అభిమానులపై పవన్ సీరియస్?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. తిరుపతిలో భాగంగా సుమారు 40 మందికి పైగా గాయాలు పాలు కావడంతో ఈయన తిరుపతి చేరుకొని బాధితులను పరామర్శించారు. ఇక చనిపోయిన మృతుల కుటుంబాలకు భారీగా ఆర్థిక సహాయం ప్రకటించారు ఇలా బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ మీడియా సమావేశంలో భాగంగా తప్పు అధికారులదేనని ఈయన తెలిపారు. భక్తుల పట్ల అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆ ఇద్దరి అధికారుల కారణంగా మా ప్రభుత్వం నిందలు మోయాల్సి వస్తుంది అంటూ పవన్ సీరియస్ అయ్యారు. ఇలా బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి వెళుతున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ గోల చేశారు ఇలా అభిమానులు గోల చేయడంతో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభిమానులు పవన్ కళ్యాణ్ ని చూసి ఆనందంతో కేరింతలు కొడుతున్న నేపథ్యంలో పవన్ మాత్రం మండిపడ్డారు. ఇది ఆనందించాల్సిన సమయం కాదు. ఒక పక్కన మనుషులు చచ్చిపోతున్నారు కనీసం బాధ్యత లేదా అంటూ సీరియస్ అయ్యారు. ఇక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు.? వారిని కంట్రోల్ చేయండి.. బాధ్యతారాహిత్యంతో వ్యవహరించొద్దు అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో విచారణ జరిపించమని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనకు కారణమైనటువంటి కొందరు అధికారులపై కూడా ఏపీ సర్కార్ వేటు వేసింది. తిరుపతి SP సుబ్బారాయుడు, జాయింట్ కమీషనర్ గౌతమిలపై సీఎం చంద్రబాబు బదిలీ వేటు వేశారు. DSP రమణ కుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.