TG: పిల్లల పరేడ్ తో సీఎం సోదరుడికి స్వాగతం….. బాడీగార్డ్ లా మారిన వికారాబాద్ కలెక్టర్?

TG: తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత తన సోదరులు కూడా ముఖ్యమంత్రులు అనే ఫీలింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా కొడంగల్ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు మరో సీఎం అయ్యారని చెప్పాలి. కనీసం వార్డ్ మెంబర్ గా కూడా గెలవని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి అధికారులు చేస్తున్న మర్యాదలు చూస్తే ఈయనే ముఖ్యమంత్రి అనే భావన కలగక మానదు.

వార్డు మెంబర్గా కూడా గెలవని తిరుపతి రెడ్డికి పోలీస్ కాన్వాయ్, స్కూల్ పిల్లలతో పరేడ్, చివరికి వికారాబాద్ కలెక్టర్ బాడీగార్డ్ అయ్యాడు. అందరికీ ఆయన సీఎం అన్న.. అయితే ఆ జిల్లాలో మాత్రం ఆయనే సీఎం అనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి.కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసేందుకు తిరుపతి రెడ్డి భారీ కాన్వాయ్‌తో వచ్చాడు.

ఊరి బయట ఆయన కాన్వాయ్ ఆగిపోవడంతో ఎర్రటి ఎండలో పిల్లలు ఆయనకు పరేడ్‌తో స్వాగతం పలికారు. ఇక ఏ హోదా లేని తిరుపతి రెడ్డి పక్కనే వికారాబాద్ కలెక్టర్ ఓ సామాన్యుడిలా ఉండిపోయారు. ఇక స్థానిక నాయకులు వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఇక ఇలాంటి మర్యాదలతో ఆయనకు స్వాగతం పలకడంతో తిరుపతిరెడ్డి ఏకంగా తానే ముఖ్యమంత్రి అని తెగ సంబరపడిపోతూ అందరికీ అభివాదం చేస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు .ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు మర్చిపోయి ఇంకెవరో పేర్లు చెబుతున్నారు. ఇలా సీఎం తరహాలో ప్రతి ఒక్కరూ కూడా రాచ మర్యాదలు అందుకుంటే సీఎం పేరు మర్చిపోక ఇంకేం చేస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు.