యష్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. కన్నడ స్టార్ యాక్టర్ కెరియర్ జర్నీ!

సినిమా హీరో కావాలని ఒక బస్సు డ్రైవర్ కొడుకు తండ్రి జేబులో నుంచి డబ్బులు తీసుకుని బెంగళూరు పారిపోయి అక్కడ నటుడిగా నిలబడటానికి అవసరమైన ప్రతి పనిని చేస్తూ ముందు టీవీలో ప్రవేశించి ఆ తర్వాత సినిమాలలో ప్రవేశించి ప్రస్తుతం స్టార్ హీరోగా రూపాంతరం చెందిన కన్నడ హీరో స్టార్ యష్. కే జి ఎఫ్ సినిమాతో అతనికి పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు దక్కింది. కన్నడలో ఇప్పుడు యష్ అంటే ఒక ప్రభంజనం అయితే అతనికి ఆ సక్సెస్ ఊరికే రాలేదు దాని వెనుక అతను పడిన కష్టం అసమాన్యమైనది.

యష్ ఒకానొక సందర్భంలో తన కెరియర్ జర్నీ గురించి మాట్లాడుతూ తన పేరు గురించి కూడా కూడా ఈ విధంగా చెప్పుకొచ్చాడు. నిజానికి యష్ అసలు పేరు నవీన్. ఇండస్ట్రీ లోకి ప్రవేశించేటప్పుడు జాతకం ప్రకారం పేరు వై తో ఉంటే బాగుంటుంది అని చెప్పడంతో యశ్వంత్ అని పెట్టుకోవడం దాంతో అందరూ యష్ అని పిలవడంతో ఆపేరే అధికారికంగా స్థిరపడిపోయింది. తను జనవరిలో పుట్టాడు కాబట్టి తనకి నవీన్ అనే పేరు పెట్టారని తను సీరియల్స్ లో నటించేటప్పుడు కూడా అందరూ నవీన్ అని పిలుస్తుంటే తన పేరు యష్ అనే విషయాన్ని పదేపదే చెప్తూ ఉండేవాడంట యష్.

తన రేంజ్ రోవర్ కారు కూడా యష్ అనే పేరుతోనే రిజిస్టర్ అయి ఉంటుందని చెప్పాడు. యష్. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ తను ఎక్కడ నుంచి వచ్చాడో ఆ మూలాలని మరిచిపోలేదు, కన్నడలో సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు. వెండితెరపై స్టార్ స్టేటస్ అందుకున్నప్పటికీ సింపుల్ లైఫ్ గడిపేందుకు ఇష్టపడతాడు యష్. ఇప్పటికీ తన తండ్రి బస్సు డ్రైవర్ గానే వర్క్ చేస్తుంటాడు. ఇక ప్రస్తుతం టాక్సిక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

అంతేకాకుండా బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాగా రామాయణాన్ని భారీగా నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ నిర్మాణంలో ఈ రామాయణాన్ని తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర ని యష్ చేయబోవటం గమనార్హం.