Tirupathi: తిరుపతిలో ఇటీవల చోటు చేసుకున్న ఘటన పట్ల కూటమి ప్రభుత్వ నేతలు వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి వంటి తదితరులు తిరుపతి వెళ్లే అక్కడ బాధితులను పరామర్శించడమే కాకుండా మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ భారీ స్థాయిలో పరిహారాలను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి ఘటనకు బాధ్యులైనటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూటమి నేతలు వెల్లడించారు.
ఇకపోతే ఈ ఘటన గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఇందుకు కారణమైనటువంటి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు .అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…టీటీడీ కార్యనిర్వహణాధికారి.. ఉప కార్యనిర్వహణాధికారులపై నిప్పులు చెరిగారు.
ఈవో జె. శ్యామలరావు, డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరిలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. వారి కారణంగా తమ ప్రభుత్వ పరువు పోయిందని పవన్ తెలిపారు. ఇద్దరు సీనియర్ అధికారులు వ్యవహరించిన తీరు కారణంగా మా ప్రభుత్వం నిందలు మోయాల్సి వస్తుంది. వారి కారణంగానే మా పరువు కూడా పోయిందని పవన్ మండిపడ్డారు.పోలీసులు క్రౌడ్ మేనేజింగ్ చేయడంలో విఫలమవుతున్నారు.. తప్పు జరిగింది, పూర్తి బాధ్యత తీసుకుంటున్నాం.. తొక్కిసలాట జరిగినప్పుడు హెల్ప్ చేసిన పోలీసులు ఉన్నారు.
ఈ ఘటన జరిగితే చోద్యం చూస్తూ ఉన్న పోలీసులు కూడా ఉన్నారని పోలీసులు తీరుపై బాధితులే ఫిర్యాదులు చేశారంటూ పవన్ ఫైర్ అయ్యారు. కొందరు పోలీసులు కావాలనే బాధ్యత రహితంగా వ్యవహరించారని తెలుస్తుంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాము అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.