KA Paul: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు. పుష్ప సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒక అభిమాని మరణించడంతో ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని అలాగే సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచను అంటూ నిండు సభలో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఇదే విషయం గురించి సినిమా పెద్దలు రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడినప్పటికీ కూడా తాను ఇచ్చిన మాట మీదే నిలబడి ఉంటానని తన నిర్ణయంలో ఏమాత్రం మార్పు ఉండదని రేవంత్ రెడ్డి తెలియ చేశారు. కొందరు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు అయితే ఊహించని విధంగా ఈయన రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతి తెలియజేయడమే కాకుండా సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటకు కూడా కట్టుబడి ఉండలేకపోయారు అంటూ రేవంత్ నిర్ణయం పై విమర్శలు వచ్చాయి. ఇలా తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు అసలు ఈ నిర్ణయంలో మార్పు లేదని చెప్పిన రేవంత్ రెండు రోజులకే తన నిర్ణయాన్ని మార్చుకొని ఇలా సినిమా టికెట్ల రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వటంతో అందరూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఈ విషయం గురించి మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా ఒకసారిగా బయటికి వచ్చింది. మొన్ననే అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనను తప్పు పట్టారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వబోమని చెప్పారు. టికెట్ రేట్లను పెంచమని చెప్పారు కానీ వెంటనే మీరు నిర్ణయం మార్చుకొని ఎందుకు సినిమాలకు బెనిఫిట్ షోలు టికెట్లు రేట్లు అనుమతి ఇచ్చారు. మీకు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే బెనిఫిట్ షోలను రద్దు చేయండి. ఈ విషయంలో నీకు 100 కోట్లు కాదు 1000 కోట్ల డీల్ ఇచ్చారా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేఏ పాల్ చేసిన ఈ కామెంట్స్ సంచలనగా మారాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా బైటకు వచ్చింది
మొన్నే అల్లు అర్జున్ మీద సంధ్య థియేటర్ ఘటనపై మర్డర్ కేసు పెట్టించి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచను అన్నావు
మరి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు నువ్వు టికెట్ రేట్లు పెంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎందుకు… https://t.co/VYQzNZvGZO pic.twitter.com/5PKGtYYC1f
— Telugu Scribe (@TeluguScribe) January 9, 2025