Samantha: ఏంటి.. ఏపీలో సమంతకు గుడి ఉందా.. ఎక్కడో తెలుసా?

Samantha: మామూలుగా అభిమానులు సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. కొందరు పేర్లను టాటూ వేయించుకుంటే మరి కొందరు ఫోటోలను టాటూలుగా వేయించుకుంటూ ఉంటారు. కానీ సెలబ్రిటీలపై ఉన్న అభిమానంతో గుడులు కట్టడం అన్నది చాలా అరుదు. ఈ అదృష్టం సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది సెలబ్రిటీలకు మాత్రమే దక్కింది. అందులో ఖుష్బు ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. మీకు తెలుసా సమంతకు కూడా గుడి కట్టారట.

 

అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలుస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన కార్ డ్రైవర్ సందీప్‌ సమంతకు వీర అభిమాని. ఆమెపై ఉన్న అభిమానాన్ని చూపేందుకు గత ఏడాది ఏకంగా ఆమెకు గుడి కట్టాడు. తన ఇంటి ఆవరణలోనే సమంత విగ్రహాన్ని ఏర్పాటు చేసి, దాని ఆవిష్కరణను ఒక వేడుకలా నిర్వహించాడు. అంతేకాకుండా ప్రతి ఏడాది సమంత పుట్టినరోజు నాడు, బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాడు.

ఇది మాత్రమే కాదు సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు కూడా సామ్ త్వరగా కోలుకోవాలంటూ మొక్కుబడి యాత్ర కూడా చేశాడు సదరు అభిమాని. సమంత కోసం తిరుపతి, చెన్నై, నాగపట్నంలో యాత్ర చేశాడు సందీప్‌. నటిగా మాత్రమే కాదు ఆమె చేస్తోన్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడు అయ్యి ఆ గుడి కట్టినట్లు సందీప్ తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ, ఏ హీరోయిన్ కి అభిమానులు విగ్రహాలు కట్టి పూజించిన దాఖలాలు లేవు. కానీ ఈ ఘనత సమంతకి దక్కిందని చెప్పాలి.