Mahesh Babu: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్ బాబు. అందులో భాగంగానే ఈ ఏడాది మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచునాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే తన లుక్ ని కూడా మార్చేసుకున్నారు మహేష్ బాబు. ఎప్పుడు లేని విధంగా గడ్డాలను మీసాలను భారీగా పెంచి సరికొత్త లుక్ లు కనిపిస్తున్నాడు మహేష్.
ఇకపోతే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆ సంగతి పక్కన పెడితే,తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. తాజాగా మహేష్ బాబు ఇటీవల టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలతో కలిసి వెకేషన్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ బాబు ఎయిర్పోర్టులో కనిపించగా ఫోటోలో క్లిక్ మనిపించారు.
ఆ ఫొటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా వైరల్ గా మారాయి. ఒక బిజినెస్ మాన్ బర్త్ డే వేడుకలో ఇలా స్టార్స్ అందరూ కనిపించారు. ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో మహేష్ బాబు చాలా సింపుల్ గా కనిపించారు. వైట్ కలర్ టీ షర్ట్, రెడ్ కలర్ క్యాప్ తో క్యాజువల్ లుక్ లో కనిపించాడు. అయితే ఇప్పుడు ఆ టీ షర్ట్ ధర నెటిజన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఆ టీషర్ట్ తెలిసి అభిమానులు అవాక్కవుతున్నారు. మహేష్ ధరించిన ఆ టీ షర్ట్ గివెన్చీ బ్రాండ్ కు చెందినది. ఈ టీ షర్ట్ ధర అక్షరాలా రూ. 74,000. సింపుల్ గా ఉన్న దాని ధర తెలిసి షాక్ అవుతున్నారు.