Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మహారాష్ట్రలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈనెల 20వ తేదీ మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రచార కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా గత రెండు రోజుల నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈయన రోడ్డు షో నిర్వహించారు అలాగే బహిరంగ సభలలో కూడా పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ప్రచారం చేయగా ఎన్డీఏ కూటమి తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురయింది. చంద్ర పూర్ లోని గుగూస్ లో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గాన వెళుతున్న రేవంత్ రెడ్డి వాహనాన్ని మహారాష్ట్ర పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. ఇలా పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కారులోనే కూర్చొని ఉన్నారు.
ఎన్నికల సమయంలో ఇలా వాహనాలను తనిఖీ చేయడం సహజమే. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా పోలీసులకు ఎంతగానో సహకరించారు. ఇలా సీఎం వాహనాన్ని తనిఖీ చేసిన మహారాష్ట్ర పోలీసులు ఆ కారులో ఏమీ లేవని గుర్తించి అనంతరం తనని పంపించారు. ఇక ఈ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఈయన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మరి మహారాష్ట్ర ఎన్నికలలో భాగంగా ఏ పార్టీ అధికారం అందుకోబోతుందనేది తెలియాల్సి ఉంది.