Nayanatara: చాలా ఇబ్బంది పెడుతున్నావ్.. 3 సెకండ్ల కోసం 10 కోట్లా.. ధనుష్ పై ఫైర్ అయిన నయన్?

Nayanatara: లేడీ సూపర్ స్టార్ నయనతార మామూలుగా ఎవరి విషయంలోను పెద్దగా రియాక్ట్ అవ్వరు. అయితే తాజాగా ఈమె హీరో ధనుష్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. హీరో ధనుష్ నయనతారకు పది కోట్ల రూపాయల లీగల్ నోటీసులు పంపించారు. ఇలా తనకు 10 కోట్ల రూపాయల లీగల్ నోటీసులు పంపించడంతో నయనతార తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నువ్వు సినిమాలలోకి రావడానికి నీ తండ్రి నీ సోదరుల సహాయం తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకున్నావు కానీ నేను మాత్రం నీలా కాదు నా రెక్కల కష్టంతో నేను ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. నెట్ ఫ్లిక్స్ వారు నా డాక్యుమెంటరీ చేస్తున్నారు అందుకోసం దానిలో మీరు నిర్మించిన నానుమ్ రౌడీ దాన్ క్లిప్స్ వాడుకునేందుకు ఎన్ఓసి అడిగితే గత రెండు సంవత్సరాలనుంచి నన్ను మీ చుట్టూ తిప్పితున్నారు.

కేవలం మూడు సెకండ్ల కోసం 10 కోట్లు కట్టాలా అంటూ ఈమె తీవ్ర స్థాయిలో ఆయనపై మండి పడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవడంతో ఇది కాస్త చర్చలకు కారణమైంది. నెట్ ఫ్లిక్స్ వారు రూపొందించిన డాక్యుమెంటరీ నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది చూసిన ధనుష్ తనకు 10 కోట్ల రూపాయల లీగల్ నోటీసులు పంపించారు.

ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణంలో నయనతార నటించిన నానుమ్ రౌడీ ధాన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఉపయోగించారు ఇలా అనుమతి లేకుండా నయనతార ఈ సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడారని ఈయన ఏకంగా 10 కోట్ల రూపాయలతో లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయంపైనే ఈమె ఏకంగా మూడు పేజీల లేఖ విడుదల చేశారు. ఇందులో తన డాక్యుమెంటరీ కోసం ఎంతోమంది సినీ నిర్మాతలు దర్శకులు నాకు చాలా సహాయం చేశారు కానీ మీరు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నారని, ఇది భావ్యం కాదని తెలిపారు. ఈ చిత్రం చాలా ముఖ్యం. అందుకే మీరు ఒప్పుకోకపోయినా నేను మాత్రం వదిలి పెట్టాలని అనుకోవడం లేదు. ఈ సినిమా నుంచి కొన్ని క్లిప్స్ నాకు ఇవ్వడానికి మీరు నిరాకరించినప్పుడే నా గుండె బద్దలైందంటూ ఈమె సుదీర్ఘమైన లేఖ రాశారు.