Ap: ఏపీలో క్షుద్ర పూజల కలకలం.. అదుపులోకి వైకాపా నాయకుడు?

Ap: ఏపీలోకి క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట మండలంలో క్షుద్ర పూజలు చేయటం తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే ఈ క్షుద్ర పూజలు వైకాపా నాయకులు చేశారని సమాచారం.. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చెందినటువంటి వజ్రాల భాస్కర్ రెడ్డి బృందం ఈ క్షుద్ర పూజలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవల కార్తీక పౌర్ణమి కావడంతో గుప్తనిధుల కోసమే ఈ క్షుద్ర పూజలు చేసినట్లు నిందితులు తెలియజేశారు. ఇలా క్షుద్ర పూజలు చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకుని బీ కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఉంచకుండా బయట తిప్పుతున్నట్లు తెలుస్తుంది.

ఈ విధంగా ఒక్కసారిగా క్షుద్ర పూజలు చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అయితే ఈ క్షుద్ర పూజలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో తరచు ఈ విధమైనటువంటి క్షుద్ర పూజలు చేత బడిలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.