మధ్యలోనే ఆగిపోయిన పాన్ ఇండియా మూవీ.. ఇవే కారణాలుంటున్న ప్రొడ్యూసర్స్!

పూజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అమెజాన్ స్టూడియో సహకారంతో వాసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షిక దేశముఖ్ లు కలసి నిర్మించాలనుకున్న సినిమా అశ్వద్ధామ: ది సాగా కంటిన్యూస్. ఈ సినిమాకి ముందుగా విక్కీ కౌశల్ ని హీరోగా అనుకున్నారు అయితే డేట్ లు సర్దుబాటు కాకపోవటంతో తర్వాత రామ్ చరణ్ యష్ తో పాటు ప్రభాస్ లాంటి చాలామంది సౌత్ హీరోల పేర్లు వినిపించాయి. అయితే చివరికి ఆ అవకాశం షాహిద్ కపూర్ ని వరించింది. నేటి ఆధునిక యుగంలో అశ్వద్ధామ జీవిస్తే ఎలా ఉంటుందని ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుందని డైరెక్టర్ సచిన్ రవి అప్పట్లో చెప్పుకొచ్చారు.

అశ్వద్ధామ ది సాగా కంటిన్యూస్ పేరుతో తెరకెక్కిపోతున్న ఈ సినిమాని హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తామంటూ అప్పట్లో దర్శకుడు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. బడ్జెట్ పరిమితులు మరియు లాజిస్టికల్ ఛాలెంజ్ ల కారణంగా ఈ సినిమా నిలిచిపోయినట్లు సమాచారం. ఈ సినిమాకి మొదటగా 500 కోట్ల పెట్టుబడి అనుకున్నారట, అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న కొద్ది బడ్జెట్ పెరిగిందని మిడ్ డే నివేదిక ప్రకారం తెలుస్తోంది.

ఏది ఏమైనాప్పటికీ పౌరాణిక సూపర్ హీరో యాక్షన్ భారతీయ సినిమాకు చాలా పెద్దది అని ఆదిత్య ధర్ వెల్లడించారు. అందువలన బడ్జెట్ పరిమితులను పరిగణలోకి తీసుకొని దీన్ని చేయటం అసాధ్యం అని టీం అర్థం చేసుకుంది. అశ్వద్ధామ ప్రీ ప్రొడక్షన్ దశలోనే బడ్జెట్ అదుపు తప్పినట్లుగా చర్చ మొదలైంది. ఇటీవల కల్కి 2898 ఏడి సినిమా ద్వారా అశ్వద్ధామ పాత్ర ప్రజాదరణ పొందింది.

ఇప్పుడు అదే పాత్రను పూర్తిస్థాయిలో తెరపై చూపించాలని ప్రయత్నించారు నిర్మాతలు. అయితే గ్రీన్ మ్యాట్ లో విజువల్ గ్రాఫిక్స్ లో తీసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం బడ్జెట్ అదుపు తప్పే అవకాశం ఉండటంతో సినిమాని నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షాహిద్ కపూర్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ చేయబోయే ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.