Teja Sajja: ఐఫా కాంట్రవర్సీ గురించి అలాంటి కామెంట్స్ చేసిన తేజా సజ్జా!

Teja Sajja: ఇటీవల జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమానికి హీరోలు రానా అలాగే తేజా సజ్జా హోస్టులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు హీరో తేజా సజ్జా. ఈ మేరకు ఈ విషయంపై తేజా స్పందిస్తూ.. ఐఫా అవార్డులకు సినీ పరిశ్రమలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది ఒక జాతీయ స్థాయి వేడుక. ఎంతో మంది స్క్రిప్ట్‌ రైటర్స్‌ దీని కోసం వర్క్‌ చేస్తుంటారు.

అన్ని విధాలా చెక్‌ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టులు ఇచ్చారు. అదీకాక ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అవన్నీ కట్‌ చేసిన క్లిప్స్‌ మాత్రమే. కానీ ఫుల్‌ వీడియో చూసి ఉంటే ఎవరికీ ప్రతికూల ఉద్దేశం రాదు. రానా నాపై జోకులు వేశారని అందరికీ అర్థమైంది. అందరూ వాటిని జోక్‌ గానే చూశారు. చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అలాగే అందరి హీరోలతో పనిచేస్తూ పెరిగాను. అందుకే వారితో నాకు మంచి అనుబంధం ఉంది.

ఇతరులను తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం అస్సలు నాకు లేదు. నాకు ఆ ఆలోచన కూడా రాదు. మా వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇది జరిగింది అంటూ క్లారిటీ ఇచ్చారు తేజా సజ్జా. ఈ విషయంపై రానా కూడా స్పందిస్తూ..నాని నాకొక సలహా ఇచ్చారు. నెక్స్ట్ టైమ్‌ నుంచి నువ్వు జోక్స్‌ వేసినప్పుడు, అది జోక్‌ అని తెలిసినట్లు వెయ్‌. లేకపోతే తెలియడం లేదు. ఇది జోక్‌.. అందరూ నవ్వండి అని నెక్స్ట్‌ టైమ్‌ నుంచి ఒక సబ్‌ టైటిల్‌ వేద్దామనుకుంటున్నాను అని అన్నారు రానా.