అవును, వారిద్దరికీ పెళ్లయింది.. కారణాలు ఆరా తీస్తున్న నెటిజన్స్!

సినిమాలలో పాటలు పాడే గాయని గాయకులు చాలామంది తమ తోటి గాయని గాయకులను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే. ఇప్పుడు ఆ కోవలోకే మరో గాయని గాయకుల జంట తోడైంది వారే అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా. అయితే ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమిటంటే ఇంతకుముందు వివాహం చేసుకున్న గాయని గాయకులు పెళ్లి చేసుకోబోతున్నట్లు కాస్త ఇంటి దొరికేది. కానీ అనురాగ్ కులకర్ణి,రమ్య బెహరా పెళ్లి సోషల్ మీడియాలో చూసేవరకు ఎవరికి తెలియక పోవడం విశేషం.

శుక్రవారం హైదరాబాదులో వీరిద్దరి పెళ్లి కుటుంబ సభ్యులు మరియు అతి కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య జరిగినట్లు సమాచారం. వీరిద్దరిది ప్రేమ పెళ్లి అని తెలుస్తోంది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ఎదురుచూసి ఇప్పుడు వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారని సమాచారం. రమ్య బెహరా సూపర్ సింగర్ 4 లో పాల్గొంది, ఈమెని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు.

టెంపర్, లౌక్యం, ప్రేమకథాచిత్రం, కొత్తజంట, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాల్లో పాటలు పాడి మంచి పేరు సంపాదించింది రమ్య బెహరా. అంతేకాదు ఆమె సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక అనురాగ్ కులకర్ణి విషయానికి వస్తే ఇతను సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్ గా నిలిచి అందరి దృష్టి ఆకర్షించాడు. తర్వాత పలు సినిమాల్లో పాటలు పాడినప్పటికీ ఆర్ఎక్స్ 100 సినిమాలో పిల్ల రా సాంగ్ ద్వారా అతనికి మంచి గుర్తింపు వచ్చింది.

శ్యాం సింగరాయ్ లో ప్రణవాలయ పాటతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు అనురాగ్. అలాంటి ఈ గాయనీ గాయకుల పెళ్ళికి సెలబ్రిటీలు ఎవరూ రాకపోవడం, కనీసం సింగర్లు కూడా పెళ్లిలో కనిపించకపోవడంతో ఎందుకు రాలేదా అంటూ అప్పుడే ఆరాలు మొదలుపెట్టారు నెటిజన్స్. అయితే అనురాగ్ కులకర్ణి కానీ రమ్య బెహరా కానీ తమ పెళ్లి ఫోటోలను ఇప్పటివరకు సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం విశేషం.