Chandra Babu: గత ఐదు సంవత్సరాలు వైకాపా అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులు మరింత వెనక్కి వెళ్లాయి అంటూ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చేసిన ఏడు అతిపెద్ద తప్పులను ఈయన అసెంబ్లీలో వివరించారు. మరి జగన్ చేసిన ఆ తప్పులు ఏంటి అనే విషయానికి వస్తే..
రాజధాని: అమరావతి రాజధానిగా ప్రకటించగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సెల్ప్ రిలయన్స్ క్యాపిటల్‌గా ఉన్న అమరావతిని పూర్తి చేసి ఉంటే ఇప్పటికే 1000 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చి ఉండేవి కానీ వైసీపీ రాజధానిని విధ్వంసం చేసిందని బాబు తెలిపారు.
పోలవరం: గత ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రం పోలవరం నిర్మాణానికి నిధులు విడుదల చేసినప్పటికీ వైకాపా మాత్రం ఆ నిధులను సొంత లాభాల కోసం ఉపయోగించుకొని పోలవరం నిర్మాణాన్ని గాలికి వదిలేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
మద్యం: మద్యం దుకాణాల నుంచి ప్రజాదనాన్ని వైకాపా నాయకులు భారీగా దోచుకున్నారు. కనీసం ఫోన్ పే గూగుల్ పే కూడా అందుబాటులోకి తీసుకురాకుండా ప్రజాధనాన్ని దోచుకున్నారు ఇప్పుడు చిన్న కిరాణా కొట్టుకు వెళ్లిన గూగుల్ పే ఫోన్ పే అందుబాటులో ఉంది. సొంత బ్రాండ్లను తయారు చేసి మార్కెట్లోకి చీప్ మద్యం తీసుకువచ్చి ప్రజాధనాన్ని లూటీ చేశారు.
విద్యుత్: కేంద్రం అత్యంత తక్కువ ధరకే పవర్ విండ్ ఇస్తామని చెప్పినప్పటికీ జగన్ మాత్రం మార్కెట్లో యూనిట్ 7.50 కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపారు. ప్రస్తుతం విద్యుత్ భారం ప్రజలపై ఉంది అంటే అది వైకాపా చేసిన పాపమేనని బాబు తెలిపారు.
మూలధన వ్యయం: మూల ధన వ్యయం తగ్గించేయడం ద్వారా.. అభివృద్ధి చేపట్టకుండా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, దీంతో ఎక్కడికక్కడ రోడ్లపై గోతులు పడి ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
పన్నులు: గత ప్రభుత్వ హయామంలో పన్నుల రూపంలో ప్రజలపై భారీగా భారం మోపారు. చివరికి చెత్తపై కూడా పన్ను విధించారని చంద్రబాబు తెలిపారు.
హింస రాజకీయాలు: గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస రాజకీయాలు జరిగాయి. ఈ రాజకీయాలలో భాగంగా సీఎంగా ఉన్న నేను డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజుగారు కూడా బాధితులేనంటూ ఈ సందర్భంగా జగన్ చేసిన తప్పులను చంద్రబాబు నాయుడు వివరించారు.