KCR -Jagan: రెండు తెల్లగా రాష్ట్రాలలో రాజకీయాలు పూర్తిగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలపాటు కొనసాగారు. అయితే ఈ ఏడాది కూడా ఆమె అధికారంలోకి వస్తామని బలంగా నమ్మిన కెసిఆర్ కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. మరోవైపు ఏపీలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.
ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఇక చోటు లేదని అందరూ భావించారు. ప్రజల నాడి తెలుసుకున్న జగన్ ఈసారి ఎన్నికలలో వై నాట్ 175 అంటూ ప్రజల ముందుకు వచ్చారు. కానీ ప్రజలు మాత్రం ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొడుతూ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇలా తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రాలో జగన్ ఇద్దరు కూడా ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యారు అంటూ విమర్శలు వచ్చాయి. ఇక జగన్ అయితే తాడేపల్లి టు బెంగళూరు, బెంగళూరు టు కడప అనే విధంగా పర్యటనలు చేస్తున్నారు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది కావస్తోంది ఆంధ్రాలో ఏడు నెలలు కావొస్తుంది ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాలలో కూడా అధికార ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత ఉందని భావించిన ఈ ఇద్దరు నేతలు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ప్రజలలోకి రావడానికి ముహూర్తం ఖరారు చేశారని చెప్పాలి. వచ్చే ఏడాది ఈ ఇద్దరి నేతలు జిల్లాల వారీగా ప్రజలలోకి వచ్చి ప్రస్తుత ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ పర్యటనలు చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం.
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా ఆయన కోసం ఎంతో మంది ప్రజలు కదిలి వస్తున్నప్పటికీ ఎందుకు ఓడిపోయారనేది ఇప్పటికీ కూడా పలువురిలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇక భారీ పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్ మాత్రం ఇప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తూ మీడియా సమావేశాలలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన అసెంబ్లీకి వెళ్లాలంటే తన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఇలా అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ ప్రజలలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.