బుల్లితెర నటి, బిగ్ బాస్ 16 ఫేమ్ నటి శ్రీజిత డే పెళ్లయిన సంవత్సరానికే మళ్లీ తన భర్తని పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కింది. నవంబర్14న ఈ నటి తన జీవిత భాగస్వామి అయిన మైకేల్ బ్లోమ్ – పేప్ ని బెంగాలీ సాంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం చేసుకుంది. వీరిద్దరూ గత ఐదేళ్లపాటు డేటింగ్ తరువాత 2021లో నిశ్చితార్థం చేసుకోగా 2023 జూన్ 1న జర్మనీలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
అయినప్పటికీ బెంగాలీ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలనుకున్న నటి శ్రీజిత డే తన కలని నెరవేర్చుకునే క్రమంలో 2024 నవంబర్ 14 న సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు తో కలిసి సంప్రదాయబద్ధంగా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఈ జంట మెహందీ,హల్దీ మరియు సంగీత్ తో సహా వరుస వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పెళ్లిలో శ్రీజిత ఎరుపు రంగు చీరను ధరించి, బంగారు ఆభరణాలు ధరించి మెరిసిపోయింది.
అలాగే మైకేల్ బంగారు రంగు షేర్వానీ, మెరూన్ కలర్ దుపట్టా ధరించి సాంప్రదాయ బెంగాలీ పెళ్ళికొడుకులా ముస్తాబయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒకరి సాంప్రదాయాలని ఒకరు గౌరవించుకోవటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. కాగా శ్రీజిత ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా శ్రీజిత డే అటు బుల్లితెరపై ఇటు వెండితెర పైనా నటించింది. కసౌటీ జిందగీకే, ఉత్తరన్,నజర్, లాల్ ఇష్క్ ఇలా పలు సీరియల్స్ చేసింది. అంతేకాకుండా తష్టనన్,లవ్ కా ద ఎండ్, మాన్ సూన్ షూట్ అవుట్, రెస్క్యూ చిత్రాల్లో యాక్ట్ చేసింది. అంతేకాకుండా హిందీ బిగ్ బాస్ సీజన్ 16 లో కూడా పాల్గొంది. నక్సల్ బరి అనే వెబ్ సిరీస్ లో కూడా మెరిసింది ఈ తార.