బ్రహ్మాజీ ఇంట్లో డైరెక్టర్లు.. బీర్ పార్టీతో కాకా పడుతున్నాడా!

టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు నటుడు బ్ర‌హ్మాజీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడు, నెగటివ్‌ రోల్స్‌ చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. వరుస సినిమాలు, భిన్న పాత్రలతో ఫుల్‌ బిజీగా కెరీర్ను ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో విలన్‌ గా చాలా పాత్రలు చేశారు.. కానీ గత కొంత కాలంగా ఆయన ఎక్కవుగా సహాయ పాత్రలు సహా కమెడియన్ రోల్స్కే పరిమితమయ్యారు. తన నటనతో ఆడియెన్స్కు ఫుల్ మీల్స్ పెట్టి మెప్పించగలరు. ఇంకా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. నెటిజన్లను నవ్వించేందుకు ఆయన వేసే ట్వీట్లు ఒక్కోసారి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. ట్రోల్స్ కూడా అవుతుంటాయి. విమర్శలను కూడా ఎదుర్కొంటుంటారు.

ఇటీవలే రీసెంట్గా నటి రోజా మెగా ఫ్యామిలీపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలానే పవన్కు మద్దతుగా ఉన్న జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై సెటైర్లు వేసింది. అయితే దీనిపై బ్రహ్మాజి కౌంటర్లు వేశాడు. ‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ క్యాంపైన చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు’. అంటూ రోజాకు కౌంటర్లు వేశాడు. దీంతో అతడి పేరు మీడియాలో మరింత మార్మోగిపోయింది.

అయితే తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా అతడు ఓ ట్వీట్ చేశాడు. చేతిలో బీర్ గ్లాస్ పట్టుకుని.. యంగ్ డైరెక్టర్స్తో తన ఇంట్లో పార్టీ చేసుకున్నాడు. వీరిలో హను రాఘవపూడి, సుధీర్ వర్మ, శివ నిర్వాణ వంటి దర్శకులు కనిపించారు. ఇది బాగా ట్రెండ్ అయింది. దీనిపై నెటిజన్లు పలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కారెక్టర్లు ఇవ్వమని కాకాపడుతున్నావా? అంటూ ఫన్నీ కామెంట్సు చేస్తున్నారు. ఇకపోతే బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ ఓ పిట్ట కథ అనే సినిమాతో హీరోగా వచ్చి సంగతి తెలిసిందే.

ఇక హను రాఘవపూడి సీతారామం సినిమాతో ఇటీవల హిట్ కొట్టాడు. ఇక సుధీర్ వర్మ రవితేజతో రావణసుర సినిమాతో ముందుకు వస్తున్నాడు. మరో డైరెక్టర్ శివ నిర్వాణ విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాల్లో బ్రహ్మాజీ ఉంటాడో లేదో.. చూడాల్సిందే.