బాలీవుడ్ క్వీన్ గా,వివాదాస్పద నటిగా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్న కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నప్పటికీ ఈమె చేసే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎంతోమంది ఈమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా భారత దేశ స్వతంత్రం గురించి ఈమె మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.
ఇదిలా ఉండగా తాజాగా కంగనా రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కంగనపై చర్యలు తీసుకోవాలని, అలాగే గత కొద్ది రోజుల క్రితం ఆమె అందుకున్న పద్మ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలంటూ ఆమెపై కేసు నమోదు చేస్తూ ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మణిజిందర్ సింగ్ సిర్సా డిమాండ్ చేశాడు. కంగనా రౌనత్ సోషల్ మీడియా వేదికగా ఖలిస్తానీ ఉగ్రవాదుల వల్లే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందంటూ రైతులను అవమానకరంగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు.
తనను ద్వేషపూరిత ఫ్యాక్టరీగా అభివర్ణించిన మణిజిందర్ సింగ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో హేట్‌ఫుల్ కంటెంట్ పోస్ట్ చేయడంతో తనపై చర్యలు తీసుకోవాలని అలాగే తను అందుకున్న పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా నిత్యం రైతులను అవమానకరంగా మాట్లాడటంతో ఈమెకు పిచ్చి ముదిరిపోయింది అని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలి అంటూ మణిజిందర్ ట్విట్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
