బాక్సాఫీస్ రిపోర్ట్ : చిరు మాస్ బ్యాటింగ్ 4వ రోజు కుమ్మేసిన “వాల్తేరు వీరయ్య”

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “వాల్తేరు వీరయ్య”. మెగాస్టార్ నుంచి వచ్చిన 154వ సినిమా ఇది కాగా మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటించి సినిమాకి అదనపు మైలేజ్ ని అయితే అందించారు.

మరి ఈ చిత్రం ని దర్శకుడు బాబీ తెరకెక్కించగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ అందుకొని మొదటి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 108 కోట్ల వసూళ్లు అందుకుంది. ఇక నాలుగు రోజుల్లో అయితే ఏపీ మరియు తెలంగాణాలో మెగాస్టార్ తాండవం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి వాల్తేరు వీరయ్య నాలుగవ రోజుకి గాను తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 12 కోట్లకి పైగా షేర్ ని రాబట్టాడట. దీనితో ఇది బాహుబలి RRR సినిమాల తర్వాత మొదటి సోమవారం ఇలా నెలకొనడం భారీ రికార్డు అన్నట్టు తెలుస్తుంది. దీనితో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే వాల్తేరు వీరయ్య చిత్రం వరల్డ్ వైడ్ గా అయితే 125 కోట్లకి పైగా గ్రాస్ అలాగే 74 కోట్ల మేరకు షేర్ ని జస్ట్ ఈ నాలుగు రోజుల్లోనే రాబట్టేసింది అని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.

అయితే వాల్తేరు వీరయ్య ఇంకా కొద్ది మేర రాబట్టాల్సి ఉంది. ఇది కూడా సింపుల్ గా వాల్తేరు వీరయ్య కొట్టేస్తుంది అని గట్టి టాక్. మొత్తానికి మాత్రం మళ్ళీ మెగాస్టార్ మాస్ బాటింగ్ మాములుగా లేదని చెప్పి తీరాలి. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్, క్యాథెరిన్ లు హీరోయిన్స్ గా నటించగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు.