పాపం..”భోళా శంకర్” పై మామూలు ట్రోల్స్ కాదు.!

టాలీవుడ్ దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ఫేడ్ అవుట్ అవుతున్న దర్శకుడు మెహర్ రమేష్ ని మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి చిరు చేయిస్తున్న సినిమా “భోళా శంకర్” కూడా ఒకటి. కాగా ఈ సినిమా తమిళ సూపర్ హిట్ వేదాళం కి రీమేక్ గా అయితే తెరకెక్కుతుంది.

మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా నిజానికి వచ్చే ఏప్రిల్ నెల లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మధ్యలో వాల్తేరు వీరయ్య పై చిరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం ఆ రిలీజ్ తో ఇది కాస్త నెమ్మదించింది. మరి ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో ట్రోల్స్ కూడా మనం బాగా చూస్తున్నాం.

పెద్ద హీరోస్ అయినప్పటికీ కొన్ని ఫన్ తో కూడా హెల్తీ ట్రోల్స్ ఎంటర్టైనింగ్ గా మారాయి. కాగా ఇప్పుడు అలాగే భోళా శంకర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఓ రేంజ్ లో పడుతున్నాయి. నిన్ననే ఉగాది కానుకగా సినిమా రిలీజ్ డేట్ ని ఈ ఆగస్ట్ 11 న అంటూ చిరు తమన్నా మరియు కీర్తి సురేష్ లపై ఓ క్లీన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

మరి ఈ పోస్టర్ దారుణంగా ట్రోల్ అవుతోంది. ఈ పోస్టర్ ఏదో షాపింగ్ మాల్ కి ప్లాన్ చేసిన పోస్టర్ లా ఉందని కొన్ని యాడ్స్ లోనో లేక బయట చూసే షాపింగ్ హోర్డింగ్స్ కి తగ్గట్టుగా ఉందని పలు బ్రాండ్స్ వేసి మీమ్స్ వేస్తున్నారు. దీనితో మేకర్స్ ప్లాన్ చేసిన ఈ పోస్టర్ కాస్తా ఈ రకంగా ట్రోల్స్ కి బలైపోయింది.