ఫేవరెట్ కో స్టార్ విషయంలో రూటు మార్చిన అనుష్క.. మరి ప్రభాస్ సంగతేంటి?

టాలీవుడ్ లేడీస్ సూపర్ స్టార్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క అరుంధతి, బాహుబలి వంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క తన అందం , అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అనుష్క గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. దీంతో ఆమె ఇక సినిమాలకు గుడ్ బై చెప్పిందని , తొందర్లోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా అనుష్క అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి బయటికీ వచ్చింది. జూలై 20 నాటికి అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని జాతి రత్నాలు ఫ్రేమ్ నవీన్ పోలిశెట్టి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. అనుష్క ఇప్పుడు యువి క్రియేషన్స్ బ్యానర్ లో, పి మహేష్ దర్శకత్వంలో అనుష్క సినిమా చేయనుందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ విషయం గురించి అనుష్క అభిమానులకి ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం స్వీటీ యోగి క్రియేషన్స్ బ్యానర్లో జరిగేకుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పోలిశెట్టి రివీళ్ చేశాడు.

తాజాగా అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా నవీన్ పోలిశెట్టి, యూవీక్రియేషన్ సంస్థ సెలెబ్రేట్ చేశాయి. సెట్ లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో నవీన్ అనుష్క కి చిన్న కేక్ లంచంగా ఇచ్చాడట. ఈ కేక్ పై ’17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అని రాసి ఉంది. ఈ విషయాన్ని నవీన్ పోలిశెట్టి ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ క్రమంలో ‘అనుష్కకి ఈ కేక్ లంచంగా ఇచ్చా. ఈ 17 ఏళ్లలో నేనే బెస్ట్ కోస్టార్ అని చెప్పింది అంటూ రసుకొచ్చాడు. అంతే కాకుండా అద్భుతమైన ఈ జర్నీకి కంగ్రాట్స్. మా షూటింగ్ చాలా ఫన్ గా కొనసాగుతోంది. మొత్తానికి రౌటర్ ఆఫ్ చేసెలోపు అప్డేట్ ఇచ్చేశా’ అని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశాడు. అయితే నేనే బెస్ట్ కో స్టార్ అని నవీన్ అనటంతో నెటిజన్స్ కామెడీ చేయకు.. అనుష్క కి నువు బెస్ట్ కో స్టార్ అయితే మరి ప్రభాస్ పరిస్థితి ఎంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క కి ఎప్పటికీ ప్రభాస్ మాత్రమే ఫేవరెట్ కో స్టార్ అని కామెంట్స్ చేస్తున్నారు.