సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లిస్ట్ తీస్తే అనిరుధ్ రవిచందర్ పేరు టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. అతను 2022 లో థమన్ కంటే తక్కువ సినిమాలే చేశాడు. ఇక దేవి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకొని దాదాపు అన్ని సినిమాలకు బెస్ట్ క్వాలిటీ మ్యూజిక్ అయితే ఇచ్చాడు. గత ఏడాది థమన్ 9, దేవిశ్రీప్రసాద్ ఇద్దరు దాదాపు 9 సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఇక అనిరుధ్ మాత్రం 5 సినిమాలు చేసినా దాదాపు అన్ని బెస్ట్ ఆల్బమ్స్ క్లిక్కయ్యాయి.
ముందుగా దేవిశ్రీప్రసాద్ లిస్ట్ లో ఖిలాడి, రౌడి బాయ్స్ వంటి డిజాస్టర్స్ ఉన్నాయి. ఇక రామ్ ది వారియర్ సాంగ్స్ లో రెండు మాస్ ట్యూన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి.
ఇక థమన్ గత ఏడాది కమర్షియల్ సినిమాలతో పాటు కొన్ని మిడియం రేంజ్ సినిమాలకు కూడా మ్యూజిక్ అందించాడు. ఇక DJ టిల్లు, రాధే శ్యామ్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ తో పరవాలేదు అనిపించాడు.
మహేష్ బాబు సర్కారు వారి పాట సాంగ్స్ బాగానే క్లిక్ అయ్యాయి. భీమ్లా నాయక్ ఆల్బమ్ తో కూడా ఒకే అనిపించాడు. కానీ పూర్తి స్థాయిలో మరికొన్ని సినిమాలకు న్యాయం చేయలేదు. వరుణ్ తేజ్ గని, నాగచైతన్య థాంక్యూ మ్యూజికల్ గా కూడా డిజాస్టర్ అయ్యాయి. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సౌండ్ కూడా ఎక్కువ రోజులు వినిపించలేదు.
ఇక అనిరుధ్ మాత్రం ఇప్పుడు దేవి, థమన్ కంటే అనుభవంలో తక్కువే. కానీ రెమ్యునరేషన్ మాత్రం వారికంటే ఎక్కువే అని తెలుస్తోంది. గత ఏడాది అతను ఇచ్చిన మ్యూజిక్ సినిమాలకు బాగా ప్లస్ అయ్యింది. బీస్ట్, డాన్, KRK, విక్రమ్, తిరు సినిమాల సాంగ్స్ ఇంటర్నెట్ ను ఒక ఊపు ఉపేశాయి. అనిరుధ్ చాలా వరకు కమర్షియల్ సినిమాలకు వర్క్ చేసినా డైరెక్టర్ స్టైల్ కొత్తగా అనిపిస్తేనే మ్యూజిక్ ఇవ్వడానికి ప్రాజెక్ట్ లను ఒప్పుకుంటున్నాడు. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా క్వాలిటీ మ్యూజిక్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక థమన్, దేవి సాంగ్స్ అయితే గతంలో మాదిరిగా క్లిక్ కావడం లేదు. అందుకే టాలీవుడ్ దర్శకులు ఇప్పుడు వీరిని కాదని అనిరుధ్ పై ఫోకస్ పెడుతున్నారు. మరి మనోళ్ళు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి.