పండంటి కూతురికి జన్మనిచ్చిన అలియా భట్ రణబీర్ దంపతులు?

రణబీర్ కపూర్ అలియా భట్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వివాహమైనటువంటి నెల రోజులకే ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇకపోతే అలియా భట్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటికీ ఈమె వరస సినిమా షూటింగ్లలో పాల్గొంటూ తను కమిట్ అయిన సినిమాలన్నింటిని పూర్తి చేశారు.

అదేవిధంగా పెళ్లికాకముందు రణబీర్ కపూర్ అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా విడుదల కావడంతో అలియా భట్ ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా బేబీ బంప్ తోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తన బేబీ బంప్ ఫోటో షూట్ చేయించుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇలా అలియా భట్ తన ప్రెగ్నెన్సీ విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది.నేడు ఉదయం ముంబైలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన రిలయన్స్ హాస్పిటల్ లో ఈమె డెలివరీ కోసం అడ్మిట్ కాగా కొన్ని క్షణాల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు.ఇక ఈ విషయాన్ని అలియా భట్ రణబీర్ దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఎంతో మంది అభిమానులు సెలబ్రిటీలు రణబీర్ ఆలియా భట్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.