మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన ఆలియా భట్.. అప్పుడేనా అంటూ ట్రోల్స్..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నిర్మాత మహేష్ బట్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆలియా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడంతో ఈ సినిమా ద్వారా ఆలియా కి మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమలో పడిన ఆలియా కొంతకాలం అతనితో డేటింగ్ చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

వివాహం జరిగిన కొంతకాలానికే తాను తల్లి కాబోతున్న విషయం ఆలియా వెల్లడించింది. ఈ వార్త తెలియటంతో ఆమె కుటుంబసభ్యులు,అభినులు చాలా ఆనందపడ్డారు. ఆలియా గర్భిణిగా ఉన్న సమయంలో కూడా సినిమా పనులతో చాలా బిజీగా ఉంది . ఇటీవల నవంబరు 6 వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇంటికే పరిమితం అయింది. ఆలియా, రణబీర్ కపూర్ తమ కూతురిని రాహా కపూర్ అని నామకరణం కూడా చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ దంపతుల గురించి మరొక వార్త
బి – టౌన్ లో చక్కర్లు కొడుతోంది. ఆలియా తన కూతురికి జన్మనిచ్చిన మూడు నెలలకే రెండవ బిడ్డకు వెల్కమ్ చెప్పనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల మెటర్నిటీ దుస్తుల కంపెనీ ప్రచారం కోసం ఆలియా ఒక యాడ్ లో నటించింది. అయితే ఆలియా ఇలా మెటర్నిటీ దుస్తుల యాడ్ లో నటించడంతో ఆలియా రెండవ బిడ్డకు వెల్కమ్ చెప్పటానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు వినిపించడంతో అప్పుడే అంత తొందరెందుకు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి ఆలియా, రణబీర్ ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. ఇటీవల పరస హిట్లు అందుకున్న ఆలియా రాకి ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ అనే సినిమాలో తన భర్త తో కలసి నటించబోతోంది. ఇక ఆలియా నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది.