ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే అనుకున్న పనులు ఇట్టే నెరవేరుతాయి?

వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు అయితే మన వంట గదిలో నిత్యావసరాలలో ఒకటైన ఉప్పు విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి ఉప్పుని ఎలా పడితే అలా వాడటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఉప్పుతో ఎన్నో రకాల దోషాలను పారద్రోలవచ్చు.ముఖ్యంగా ఉప్పుతో ఈ చిన్న పరిహారాలు చేస్తే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఉప్పును ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే..

ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త ఉప్పుని తీసుకొని మన తల చుట్టూ ఐదు లేదా ఏడుసార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో వేయటం వల్ల ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి. అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలోకి కాస్త ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది.

ఇక మన ఇంట్లో నేలను శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలోకి కాస్త ఉప్పు వేయడం వల్ల మన ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడి ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్తుంది. ఇక మీరు నివసించే గదిలో ఒక గ్లాసు నీటిలో కాస్త ఉప్పు వేసి ప్రతిరోజు దానిని మారుస్తూ ఉండాలి. అయితే ఈ నీటిని ఎవరు తాగకుండా ఎవరి తొక్కకుండా పడేయాలి ఇలా చేసినప్పుడు మన గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఈ విధంగా ఉప్పుతో మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలను నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీ ని కలిగిస్తుంది.