జీడిపప్పు తినడం వల్ల లాభమా నష్టమా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తినే డ్రైనట్స్ లలో జీడిపప్పు ఒకటి. జీడిపప్పు తినడం వల్ల వంటకాలకు అదనపు రుచి లభిస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. జీడిపప్పు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. జీడిపప్పులో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. జీడిపప్పు తినడం వల్ల శరీరానికి అవసరమైన ఆరోగకరమైన కొవ్వులు లభిస్తాయి.

ఎవరైతే బరువు పెరగాలని భావిస్తారో వాళ్లు వేయించి ఉప్పు జోడించిన జీడిపప్పు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. జీడిపప్పులో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ జీడిపప్పు తీసుకుంటే బరువు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బరువు తగ్గాలని భావించే వాళ్లు మాత్రం నానబెట్టిన జీడిపప్పును తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఉప్పు, కారం వంటివి జోడించిన జీడిపప్పును మాత్రం తీసుకుంటే ఆరొగ్యానికి మంచిది కాదని చెప్పవచ్చు. వేయించిన ప్రక్రియ కారణంగా ఆరోగ్యకరమైన కొవ్వులు తగ్గే అవకాశాలు ఉంటాయి. సోడియం కంటెంట్ కూడా బరువు బరువు పెరగడానికి దారి తీస్తుందని చెప్పవచ్చు. జీడిపప్పు ఎక్కువగా తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. గర్భధారణ సమయంలో పిండం వాంఛనీయ పెరుగుదలతో సంబంధం ఉన్న అన్ని అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో జీడిపప్పు పుష్కలంగా నిండి ఉంటుందని చెప్పవచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచడంలో జీడిపప్పు ఉపయోగపడుతుంది. జీడిపప్పులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుందని చెప్పవచ్చు.