Kitchen Tips: మనం ప్రతిరోజు ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటాము అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఒకటికి రెండుసార్లు ఉప్పు వేయడం లేదంటే ఉప్పు కాస్త ఎక్కువగా పడటం జరుగుతుంది. ఉప్పు తక్కువ ఉంటే తిరిగి కాస్త కూరలలో కలుపుకోవచ్చు కానీ ఎక్కువగా ఉంటే ఆ కూరను అసలు తినలేము. ఇలా కూరలలో అధిక ఉప్పు పడినప్పుడు చాలామంది ఏం చేయాలో తెలియక వాటిని పడేస్తూ ఉంటారు.
ఈ విధంగా కూరలో కనక ఉప్పు అధికంగా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్స్ పాటిస్తే కూరలో ఉన్న ఉప్పు మొత్తం తొలగిపోయి కూర చాలా రుచికరంగా ఉంటుంది. మరి కూరలోకి ఉప్పు ఎక్కువ అయినప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి అనే విషయానికి వస్తే.. ఏదైనా మాంసాహారం వంటి పదార్థాలు తయారు చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ అయితే అందులోకి ఒక చెక్క నిమ్మరసం వేయటం వల్ల ఉప్పు పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా కూరకు మరింత రుచి వస్తుంది.
అదేవిధంగా బంగాళదుంప పొట్టు మొత్తం తీసి గుండ్రంగా కట్ చేసుకుని ఒక నాలుగు ముక్కలు కూరలో వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన ఈ ముక్కలను మనం తినేటప్పుడు తీసివేయటం వల్ల ఉప్పు తగ్గుతుంది. అలాగే మనం తయారుచేసే కూరను బట్టి అందులో టమోటా మిశ్రమాన్ని వేయటం వల్ల ఉప్పు తగ్గటమే కాకుండా కూర గ్రేవీగా తయారై రుచి ఉంటుంది.
ఇకపోతే ఉప్పు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అందులో ఒక కప్పు పెరుగు వేసి కలియ పెట్టాలి. ఇలా పెరుగు వేయటం వల్ల ఉప్పు తగ్గడమే కాకుండా ఆహారం రుచిగా కూడా తయారు అవుతుంది. అయితే పెరుగు అంటే ఇష్టపడిన వారు కాస్త మీగడ వేసిన ఉప్పు తగ్గుతుంది. ఇలా ఈ చిట్కాలను కనుక పాటిస్తే కూరలో మనం అధికంగా వేసిన ఉప్పు కాస్త తగ్గిపోయి మనం చేసిన వంటలు రుచికరంగా ఉంటాయి.